సోషల్ మీడియా అంతా హడావుడిగా ఉంది. న్యూ ఇయర్ విషెస్ అయిన కొన్ని గంటల నుంచే మరో కొత్త మహమ్మారి వ్యాప్తి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్స్ దగ్గర నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఈ వైరస్‌కు చెందిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. చైనాలో కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయి అని...కోవిడ్ తరహాలోని ఇవి కూడా ప్రచాన్ని కబళిస్తాయని అంటున్నారు.
HMPV వైరస్..
చైనాలో వ్యాపిస్తోందని చెబుతున్న వైరస్ కూడా శ్వాసకోశకు సబంధించినది. హ్యూమన్ మెటా వైరస్ (HMPV) దీని పేరుగా చెబుతున్నారు. ఇది కూడా కోవిడ్‌లానే వేగంగా విస్తరిస్తోందని అంటున్నారు. చైనాలో చాలా ఆసుప్రతులు ఇప్పటికే ఈ వైరస్ రోగులతో నిండిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా అక్కడ ఇన్‌ఫ్లుంయెజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్–19 రోగులతో కూడా అక్కడ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని తెలుస్తోంది. 2001లోనే ఈ HMPV కనుగొన్నారు. ముఖ్యంగా ఇది చైనాలోని ఉత్తర ప్రాంతాలలో 14 ఏళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులను చైనా నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ వెరిఫై చేస్తోంది. ఈ వైరస్‌కు సంబంధించి డిసెంబర్ 16-22 వరకు మాత్రమే డేటా అందింది. ఇది రానున కాలంలో మరింత పెరిగే అకాశం ఉందని అంటున్నారు. చలికాలం పెరుగుతున్న కొద్దీ వైరస్‌లు, శ్వాసకోశ వ్యాధులూ మరింత ప్రబలుతాయని చెబుతున్నారు.
Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
⚠️ BREAKING:
— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease) January 1, 2025
China 🇨🇳 Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums.
Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China. pic.twitter.com/GRV3XYgrYX
ప్రస్తుతం చైనాలో మళ్ళీ మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, సిక్స్ ఫీట్ దూరాన్ని పాటించడం లాంటివి చేస్తున్నారు. అయితే ఈవైరస్ గురించి ఎటువంటి అధికారికా ప్రకటనా రాలేదు. చైనా ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. అక్కడ HMPV వ్యాప్తి కారణంగా చైనా అధికారికంగా ఎమర్జెన్సీ కూడా ప్రకటించలేదు. ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, ఈ వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా కాదా అనే సందేహాలు వెలువడుతున్నాయి.
Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం