Delhi: రెస్టారెంట్‌లో గాంధీ కుటుంబం సందడి

పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు.

New Update
family

Rahul Gandhi Family

ఎప్పుడూ పనేనా కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం. అంతే ఢిల్లీలో ఓ రెస్టారెంట్‌ కు వెళ్ళి హాయిగా తినేసి, ఫోటోలకు ఫోజులు ఇచ్చి మరీ వచ్చారు. ఇలా మొత్తం కుటుంబం అంతా ఒకేచోట, అదీ లీజర్‌‌గా కనిపించడం చాలా అరుదనే చెప్పాలి. సోనియా, రాహుల్‌, ప్రియాంక-రాబర్ట్‌ వాద్రా దంపతులతో పాటు వారి కూతురు మిరాయాలు ఢిల్లీలో ఉన్న క్వాలిటీ రెస్టారెంట్‌కు వెళ్లారు. అంతేనా మీరు కూడా ఇక్కడకు వస్తే చోలే భటూరే ట్రై చేయండి అంటూ రాహుల్ గాంధీ ఫుడ్ సజిషన్‌ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Also Read: Fire Accident: కాచిగూడ-చెన్నై ఎగ్మోర్‌ రైలులో మంటలు

Advertisment
తాజా కథనాలు