యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల్లో ఆ గేయాన్ని పాడాల్సిందే
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇకనుంచి వందేమాతం గేయాన్ని పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇకనుంచి వందేమాతం గేయాన్ని పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
తెలంగాణ క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోఖాళీగా ఉన్న మూడువేలకు పైగా వ్యాయమ ఉపాధ్యాయులు. అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. దాదాపు 50కు పైగా స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అయితే రేపు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
మరో రెండ్రోజుల్లో జులై నెల ముగియనుండటంతో ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆదివారాలు, పండుగలు కలిపి మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి.
తెలంగాణలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు జూలై 23న ఉద్యమం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది అవకాశం కల్పిస్తోంది. ఇందులో పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లు లభిస్తాయి. ఒకటో క్లాస్లో జాయిన్ కావడానికి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.