Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు

మరో రెండ్రోజుల్లో జులై నెల ముగియనుండటంతో ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆదివారాలు, పండుగలు కలిపి మొత్తం 10 రోజులు సెలవులు రానున్నాయి.

New Update
10 Days Holidays in August Month for Schools, Know Details

10 Days Holidays in August Month for Schools, Know Details

మరో రెండ్రోజుల్లో జులై నెల ముగియనుండటంతో ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇది ఆప్షనల్‌ సెలవుగా ఉంది. ఆ తర్వాత ఆగస్టు 9న రెండో శనివారం, రక్ష బంధన్‌ వస్తుంది. ఆగస్టు 10న ఆదివారం. ఈ వారంలో విద్యార్థులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.  అనంతరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. 

Also Read: స్పెర్మ్ టెక్ ఆఫీస్‌ సోదాల్లో షాకింగ్‌ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు

అయితే ఆగస్టు 15కు ముందు ముందు పాఠశాలల్లో సందడి వాతావరణం ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, రిహార్సల్స్‌, డ్యాన్సులు, ఆటల పోటీలు, అలంకరణలు ఇలాంటివి జరుగుతాయి. ఆగస్టు 11 నుంచి 14 వరకు పాఠశాలలు తెరిచి ఉన్నప్పటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులకు పండుగ వాతావరణమే. ఆగస్టు 15 కార్యక్రమం కోసమే అందరూ సిద్ధమవుతుంటారు. ఆయా రోజుల్లో క్లాసులు కూడా ఎక్కువగా ఉండవు.  

Also read: పాకిస్థాన్‌ గుండెలపై దాడి చేశాం...దాడులు ఆపాలని ట్రంప్ చెప్పలేదు: మోదీ

ఇక ఆగస్టు 15 తర్వాత 16వ తేదిన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ఉంది. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అన్ని గ్రామాల్లో జరుపుకుంటారు. ఆ తర్వాత ఆగస్టు 17న ఆదివారం వస్తుంది. ఇక్కడ ఆగస్టు 15 తర్వాత.. 16,17 తేదీల్లో రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 27న వినాయక చవితి. ఆరోజు గవర్నమెంట్‌ హాలీడే అన్న సంగతి తెలిసిందే. ఇలా అన్ని ఆదివారాలు, పండుగ రోజులు కలుపుకుంటే మొత్తం 10 రోజుల సెలవులు ఆగస్టు నెలలో రానున్నాయి. ఏ తేదీల్లో సెలవులు వస్తున్నాయే ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆగస్టు 3న ఆదివారం, 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం, 27 వినాయక చవితి, 31 ఆదివారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు 10 రోజులు సెలవులు తీసుకోవచ్చు. ఈసారి ఆగస్టు నెలలో పండుగలు కలిసి రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐటీ ఉద్యోగులకు కూడా ఈ ఆగస్టు నెలలో లాంగ్‌ వీకెండ్స్‌ రానున్నాయి. 

Also Read: భయపెడుతున్న ఐటీ ఉద్యోగాలు.. లక్షలాది మందిని తొలగిస్తున్న బడా కంపెనీలు

మరికొన్ని రోజులు గడిస్తే సెప్టెంబర్‌ 21న బతుకమ్మ పండుగ ఉంది. ఆ తర్వాత విద్యార్థులకు దసరా సెలవులు మొదలవుతాయి. తెలంగాణలో దాదాపు రెండు వారాలకు పైగా దసరా సెలవులు ఉంటాయి. ఈ ఏడాది చూసుకుంటే దసరా ఆగస్టు 2 న ఉంది. ఈసారి పండుగ గాంధీ జయంతి రోజునే రావడం విశేషం. గతేడాది అక్టోబర్ 12 న రాగా, 2023న అక్టోబర్ 24న వచ్చింది. ఇక  ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి పండుగ రానుంది.

Advertisment
తాజా కథనాలు