Holiday : ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు.. ఆ జిల్లాలోని 10 మండలాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.

New Update
schools

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తు్న్నాయి.  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి., పచ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.  

భారీగా వరద నీరు

వంశధార నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండటం, వరద ముప్పు ఉన్నందున శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

విశాఖపట్నం, అనకాపల్లి సహా ఇతర కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. ఇవాళ్టి నుంచి క్లాసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు హాలిడేస్ ఆస్వాదించిన విద్యార్థులు, టీచర్లు ఇక బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లినవారు ప్రభుత్వం సెలవులను ఒక్కరోజైనా పొడిగిస్తుందని ఆశగా ఎదురుచూశారు. నిన్న రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశచెందారు.

రాబోయే నాలుగు రోజుల పాటు

ఇక తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ నెల 5న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డిలో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు