/rtv/media/media_files/2025/10/11/physical-education-teachers-2025-10-11-13-49-51.jpg)
physical education teachers
తెలంగాణ క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో అనేక ఏళ్లుగా ఖాళీగా ఉన్న మూడువేలకు పైగా వ్యాయమ ఉపాధ్యాయులు(pet). అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీలను గుర్తించి రెండు వారాల్లో నోటిఫికేషన్(Govt Job Notifications 2025) జారీ చేయాలని వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగా ఏర్పాటవుతున్న భారత్ ప్యూచర్ సిటీలో యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి తోడు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్రీడారంగాన్ని విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో ఏ క్రీడలు జరిగినా అవి హైదారాబాద్‌లో నిర్వహించాలని, ఇందుకు తమ రాష్ట్రంలో ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు క్రీడాశాఖ మంత్రిని కలిసి చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లు క్రీడారంగానికి వచ్చే బడ్జెట్‌లో క్రీడరంంగానికి విరివిగా నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి తగినట్లు అన్ని పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధన పెట్టాలని నిర్ణయించింది.
Also Read : వరంగల్ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం.. పొంగులేటి vs కొండా మురళి
TGPSC Notification For 3 Thousand Jobs
రాష్ర్టంలోని 4,641 పాఠశాలల్లో 2500 లకు పైగా పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో కొత్తగా 1803 ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయల పోస్టులను సృష్టించి వాటిని త్వరిత గతిన భర్తీ చేయాలని సంకల్పించారు. ఈ ఖాళీలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన విద్యాశాఖ ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. త్వరలో జరిగి మంత్రి వర్గంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
పాఠశాలలతో పాటు జూనియర్, డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వ్యాయమ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఖాళీల వివరాలను అందజేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఇప్పటికే ఆయా విశ్వవిద్యాలయాలు, కళాశాలల డైరెక్టర్లకు లేఖలు రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో మొత్తంగా 3 వేలకు పైగా వ్యాయమ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని భర్తీ చేసి వచ్చే ఏడాది నుంచి వారంలో రెండు రోజులు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. అవసరమైతే వార్షిక పరీక్షల్లో మార్పులు చేసి పరీక్షల్లో కొన్ని మార్కులను కూడా ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు.
క్రీడా శిక్షణతో పాటు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన స్కూళ్లలో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా, అదనంగా 261 హెడ్‌మాస్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే, పీఈటీ మరియు హెడ్‌మాస్టర్ పోస్టులను త్వరలో రానున్న డీఎస్సీ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్/టీచర్స్) ప్రకటన ద్వారా భర్తీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు తీసుకుంటున్న ఈ చర్యలు విద్యార్థులందరికీ విద్యతో పాటు క్రీడలలోనూ ప్రోత్సాహం లభించేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా, విద్యార్థులలో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి మరియు వారిలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ 1,803 పీఈటీల నియామకం కీలకపాత్ర పోషించనుంది. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య