/rtv/media/media_files/2025/03/01/NVTwUgDk6vk9ZTeHFndk.jpg)
students
ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ స్కూల్‌లో పిల్లలను చదివించాలని చాలా మంది కలలు కంటారు. పెద్ద ప్రైవేట్ స్కూల్‌లో అయితే చదువులు గొప్పగా చెబుతారని భావిస్తారు. కానీ ప్రైవేట్ స్కూల్‌లో చదివించే స్తోమత కొందరికి ఉండదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ స్కూల్‌లో చదవడానికి బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రతీ ఏడాది అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన
ఈ విద్యా సంవత్సరానికి..
ఈ చట్టం ద్వారా పేద పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో మొత్తం 25 సీట్లు లభిస్తాయి. ఒకటో క్లాస్‌లో జాయిన్ కావడానికి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి అప్లై చేసుకోవచ్చు. ఉచితంగా విద్యను అందించే ప్రైవేట్ పాఠశాలలకు ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏయే పాఠశాలలు ఉచిత విద్యను అందిస్తాయో ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలి. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ మధ్యలోగా పూర్తి వివరాలను కూడా వెబ్‌సైట్‌లో తెలియజేయాలని ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
ఇదిలా ఉండగా తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో కీలక మార్పులు చేయనున్నారు. పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. కానీ ఈ సారి మెమోలపై కీలక మార్పులు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇకపై మెమోలను సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు రాసినట్లు సమాచారం. అయితే త్వరలోనే పదవ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్
schools | private-schools | admissions