/rtv/media/media_files/2026/03/09/iran-war-2026-03-09-16-33-06.jpg)
Iran- Israeli War
Iran- Israeli War : ఇరాన్, ఇజ్రాయెల్,-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మానవ, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం సంభవించింది. యుద్ధం మూలంగా ఇరాన్‌లో 1,200 మందికి పైగా పౌరులు మరణించారు, వీరిలో 200 మందికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు.యుద్ధం కారణంగా ఇరాన్‌లోని 25 ఆసుపత్రులలో తొమ్మిది ఆసుపత్రులు పూర్తిగా మూసివేయబడ్డాయి. అనేక ఆరోగ్య కేంద్రాలు తీవ్రంగా నష్టపోయాయి.
అమెరికా- ఇజ్రాయెల్ దాడుల మూలంగా దేశంలోని అనేక ఆరోగ్య సౌకర్యాలు దెబ్బతిన్నాయి. 13 అంబులెన్స్‌లతో సహా మరో పదిహేను ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. టెహ్రాన్, మహాబాద్, ఖొమేన్ వంటి నగరాల్లో ఏడుగురు రెస్క్యూ సిబ్బంది గాయపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 1,200 మంది చనిపోగా,10,000 మంది గాయపడ్డారు, ఆసుపత్రులు ,భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఈరోజు 10వ రోజు. ఇరుపక్షాలు ఒకదానిపై ఒకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరుపుకుంటున్నాయి. ఈ ఘర్షణలో రెండు దేశాలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మరోవైపు, గల్ఫ్ దేశాలు తమ స్నేహానికి మూల్యం చెల్లిస్తున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. మౌలిక సదుపాయాలు నాశనం అవుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ కూడా భారీగా నష్టాలను చవిచూస్తోంది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హోస్సేన్ కర్మన్‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్‌లో, "యుద్ధం ఇరాన్‌లో భారీ పౌర ప్రాణనష్టానికి కారణమైంది" అని పేర్కొన్నారు. ఇరాన్ లో జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం, మౌలిక సదుపాయాల నష్టాన్ని ఆయన వివరించారు.
కర్మన్‌పూర్ ప్రకారం, ఇరాన్‌లో 1,200 మందికి పైగా పౌరులు మరణించారు.10,000 మందికి పైగా గాయపడ్డారు. మృతులలో 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న దాదాపు 200 మంది పిల్లలు ,200 మంది మహిళలు ఉన్నారు. మరో 1,400 మంది మహిళలు కూడా గాయపడ్డారు.
ఈ దాడుల వల్ల ఇరాన్ ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. 25 ఆసుపత్రులు దెబ్బతిన్నాయని, తొమ్మిది ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయని, 18 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు 14 అంబులెన్స్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కర్మన్‌పూర్ తెలిపారు. రెండు కౌంటీ ఆరోగ్య కేంద్రాలు, 17 సమగ్ర ఆరోగ్య కేంద్రాలు, రెండు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జరుగుతున్న సంఘర్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ దీనిపూ స్పందిస్తూ .. "ఇరాన్, మధ్యప్రాచ్యం అంతటా సంక్షోభం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు.100,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ దాడుల వల్ల పదహారు దేశాలు ప్రభావితమయ్యాయి." ఏజెన్సీ సమాచారం ప్రకారం, ఇరాన్‌లో ఆరోగ్య సౌకర్యాలపై 13 దాడులు, లెబనాన్‌లో ఒక దాడి జరిగాయి. ఆరోగ్య సేవలపై దాడులు మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.
ఈ వివాదం ప్రజారోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. అణు బెదిరింపులు ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌లోని WHO ప్రపంచ ఆరోగ్య అత్యవసర సౌకర్యానికి చెందిన లాజిస్టిక్స్ హబ్‌లో కార్యకలాపాలు ప్రస్తుతం అభద్రత కారణంగా నిలిపివేయబడ్డాయి.
అంతర్జాతీయ మానిటర్ల సమీక్ష, ఉపగ్రహ చిత్రాలు, వీడియోల ప్రకారం ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమైనప్పటి నుండి పాఠశాలలు, ఆసుపత్రులు,చారిత్రక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. ఇటీవలి దాడులు సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న ఆసుపత్రులు, ఇతర పౌర సౌకర్యాలను దెబ్బతీశాయి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బాంబు దాడి జరగడంపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి.
ఇరాన్ లో ప్రజలతో కమ్యూనికేషన్ సంబంధాలు మరింత కష్టతరం అయ్యాయి. ఇంటర్నెట్ పూర్తిగా మూసివేశారు. దీనివల్ల క్షేత్రస్థాయి పరిస్థితికి సంబంధించిన సమాచారం అందడం లేదు. ఇంటర్నెట్ షట్ డౌన్ కారణంగా వీడియో ఫుటేజ్ కూడా అందుబాటులో లేదు.
ఇరానియన్ రెడ్ క్రెసెంట్ ఏజెన్సీ (HRNA) ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 30 ప్రావిన్సులలో 148 సంఘటనలలో 752 దాడులు జరిగాయి. మార్చి 8 నాటికి, 194 మంది పిల్లలు సహా 1,205 మంది పౌరులు మరణించారు, అలాగే 187 మంది సైనికులు కూడా మరణించారు. 316 మందికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియదు.
ఈ దాడుల్లో దాదాపు 34 శాతం దాడులు టెహ్రాన్‌పైనే జరిగాయని, ఆ తర్వాతి స్థానాల్లో ఇస్ఫహాన్ (సుమారు 8 శాతం), కెర్మాన్‌షా (సుమారు 6 శాతం) ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఖుజెస్తాన్, అల్బోర్జ్, అనేక పశ్చిమ ప్రావిన్సులలో కూడా దాడులు జరిగాయి.
ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ఈ విధ్వంసం వైద్య సదుపాయాలకే పరిమితం కాలేదని తెలిపింది. ఇటీవలి వైమానిక దాడుల్లో దాదాపు 10,000 నివాస, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయని దాని అధిపతి డాక్టర్ పిర్ హోస్సేన్ కొలివాండ్ తెలిపారు.
అత్యవసర బృందాలు నిర్వహించిన ఆన్-ది -గ్రౌండ్ అంచనాల ప్రకారం, 7,943 నివాస ప్రాంతాలు,1,617 వాణిజ్య సముదాయాలు ప్రభావితమయ్యాయి. ముప్పై రెండు వైద్య. వైద్య కేంద్రాలు, అలాగే 65 పాఠశాలలు దెబ్బతిన్నాయి. పదమూడు రెడ్ క్రెసెంట్ సౌకర్యాలు కూడా దెబ్బతిన్నాయి.
Follow Us