/rtv/media/media_files/2025/08/13/hyderabad-heavy-rains-2025-08-13-15-52-42.jpeg)
Hyderabad Heavy Rains
వర్షాలు, వరదల్లో తెలంగాణ మునిగి తేలుతోంది. బుధవారం, గురువారాల్లో ఇవి మరింత ఎక్కువగా పడనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో 17న వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో గురువారం ఒంటి పూట బడులు మాత్రమే నిర్వహించాలని చెప్పింది. తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు రెడ్ అలెర్ట్ లో ఉన్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఆరెంజ్ అలెర్ట్ లో ఉండగా..నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీని వలన చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి. రూడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారయ్యింది.
సూర్యాపేటలో కూడా..
భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 న సూర్యాపేట జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా జిల్లాలో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు గురువారం పాఠశాలలకు సెలవు పాటించాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ అలా కాదని ఎవరైనా యాజమాన్యాలు పాఠశాలలు నడిపించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు భారీ వర్షాల సహాయక చర్యల కోసం ముఖ్యమైన ఫోన్ నంబర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సహాయం కోసం వీటికి సంప్రదించాలని చెప్పింది.
*విపత్తు నిర్వహణ మరియు అత్యవసర సేవలు
* NDRF (జాతీయ విపత్తు స్పందన దళం): 8333068536
* ICCC (ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్): 8712596106
పౌర సేవలు (GHMC & నీటి సరఫరా)
* GHMC (జీహెచ్ఎంసి): 8125971221
* HMWSSB (జలమండలి): 9949930003
పోలీస్ విభాగాలు
* హైదరాబాద్ పోలీస్: 9154170992
* ట్రాఫిక్ పోలీస్: 8712660600
* సైబరాబాద్ పోలీస్: 8500411111
* రాచకొండ పోలీస్: 8712662999
విద్యుత్ మరియు రవాణా సేవలు
* TGSPDCL (విద్యుత్ శాఖ): * 7901530966
* RTC (ఆర్టీసీ): 9444097000