/rtv/media/media_files/2025/11/10/yogi-2025-11-10-14-29-44.jpg)
Singing 'Vande Mataram' to be compulsory in all UP schools, colleges
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇకనుంచి వందేమాతం గేయాన్ని పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేశారు. గోరఖ్‌పూర్‌లో 'ఏక్తా యాత్ర' పేరుతో నిర్వహించిన సామూహిక వందేమాతరం గేయాలపాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో జాతీయ గీతాన్ని పాడటం వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలకు దేశభక్తి, గౌరవం ఏర్పడతాయని పేర్కొన్నారు.
वंदे मातरम गाना ही होगा..
— Vivek K. Tripathi (@meevkt) November 10, 2025
उत्तर प्रदेश के हर स्कूल और शिक्षण संस्थान में अब वंदे मातरम गीत गाना अनिवार्य करेगी योगी सरकार.
मुख्यमंत्री योगी आदित्यनाथ ने आज गोरखपुर में लौह पुरुष सरदार पटेल की 150वीं जयंती समारोह के मौके पर हुए कार्यक्रम के दौरान मंच से इसकी घोषणा की..… pic.twitter.com/Ycws1QjMtj
Also Read: బుద్ది మార్చుకొని పాక్.. భారత్ చుట్టూ ఉగ్ర కుట్రలకు ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో వందేమాతం గేయం సంచలనం సృష్టించింది. ఎంతో భారతీయుల్లో స్పూర్తి నింపింది. ఈ గేయానికి ఈ ఏడాది నవంబర్ 7 నాటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 1875, నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రచించారు.
Also Read: వెండిపై కూడా బ్యాంక్ లోన్స్.. RBI కొత్త మార్గదర్శకాలు విడుదల
ఆయన తొలిసారిగా రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఈ గేయాన్ని ప్రచురించారు. మరోవైపు శుక్రవారం ఢిల్లీలో వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వందేమాతరం గేయం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. అయితే ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఉదయం ప్రార్థన చేసేటప్పుడు వందేమాతరం గేయాన్ని విద్యార్థులు ఆలపిస్తున్నారు.
Follow Us