Breaking: ఢిల్లీలో మళ్ళా బాంబు కలకలం.. 50 స్కూళ్ళకు పైగా బెదిరింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. దాదాపు 50కు పైగా స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

New Update
delhi

Delhi schools

ఢిల్లీలో స్కూళ్ళకు బాంబు బెదిరింపులు రావడం ఈ మధ్య కాలంలా చాలా ఎక్కువ అయిపోయింది. తాజాగా ఈరోజు మరోసారి 50కి పైగా స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అన్ని పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో 32 బెదిరింపులు నకిలీ విగా తేల్చారు. మిగతా వాటిల్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రసాద్ నగర్‌లోని ఆంధ్రా స్కూల్ మరియు మాల్వియా నగర్‌లోని SKV హౌజ్ రాణి స్కల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నజాఫ్‌గఢ్‌లోని ఒక పాఠశాల పేరు కూడా బయటకు వచ్చింది కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.

రెండు రోజుల క్రితం కూడా..

రెండు రోజుల క్రితం సోమవారం నాడు కూడా 30కు పైగా స్కూళ్ళల్లో కూడా పేలుడు పదార్ధాలు అమర్చినట్టు ఈ మెయిల్స్ అందాయి. అప్పుడు కూడా బాంబు స్క్వాడ్ లు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి...బూటకపు బెదిరింపులను తేల్చారు. ది టెర్రరిజర్స్ 111 గ్రూప్ అనే గ్రూప్ ఈ ఈ మెయిల్స్ ను పంపించినట్టు తెలుస్తోంది. ఈ గ్రూప్...స్కూల్ ఐటీ వ్యవస్థలను హ్యాక్ చేసి, విద్యార్థులు, సిబ్బంది డేటాబేస్‌లను దొంగిలించి, నిఘా కెమెరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెబుతోంది. 72 గంటల్లోపు మా Ethereum చిరునామాకు $5,000 క్రిప్టో కరెన్సీ చెల్లించాలని లేకపోతే స్కూళ్ళను పేల్చేస్తామని చెప్పింది.

వరుసపెట్టి బాంబు బెదిరింపులు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమేనంటే ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దాంతో పాటూ బాంబు బెదిరింపులు, తనిఖీలు అని చెప్పి క్లాస్ లు కూడా సరిగ్గా జరగడం లేదని..సెలవులు కూడా ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

Also Read: America: రష్యా చమురుతో భారత్ లాభాలు.. అమెరికా ట్రెజరీ కార్యదర్శి దాడి

Advertisment
తాజా కథనాలు