HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనువడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కొడుకు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తీగల కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.