Road Accident: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు

యూపీలోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ట్రక్కు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మైనర్లు సహా ఐదుగురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. బులంద్‌షహర్ రోడ్డులోని మినీలాండ్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

New Update
uttar pradesh hapur road accident five killed

uttar pradesh hapur road accident five killed

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మైనర్లు సహా ఐదుగురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వస్తున్న ట్రక్కు బైక్‌ను ఢీకొట్టడంతో నలుగురు మైనర్లు సహా ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి హాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బులంద్‌షహర్ రోడ్డులోని మినీలాండ్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

Also Read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్‌ ఎస్సై స్పాట్ డెడ్

Also Read :  ఇదెక్కడి మాస్‌ రా మావా.. బీరు తాగుతూ వాదించిన న్యాయవాది..

Hapur Road Accident

అందుతున్న సమాచారం ప్రకారం.. రఫిక్ నగర్ నివాసి అయిన డానిష్ (40) హాపూర్ ప్రాంతంలోని తన స్నేహితుడి ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ నుండి తిరిగి వస్తున్నాడు. అతడు తన ఇద్దరు పిల్లలతో పాటు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల తన సోదరుడి పిల్లలతో బైక్‌పై వస్తుండగా.. వేగంగా వస్తున్న ట్రక్కు వారి బైక్‌ను ఢీకొట్టింది. 

Also Read :  ఓటీటీలోకి ‘థగ్‌ లైఫ్‌’.. సైలెంట్‌గా వచ్చేసిన కమల్ హాసన్

దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు పంపారు. అదే సమయంలో ఢీకొన్న ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

Also Read :  ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

Latest crime news | crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు