Dasari Kiran: ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. ఎందుకంటే..?
హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గాజుల మహేష్ వద్ద కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకొన్నాడు. తిరిగి ఇవ్వామంటే దాడి చేశాడని మహేశ్ ఆరోపించారు.