వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంటున్నాడు. సినిమాలపై ఫోకస్ పెట్టి.. ఆయన కాంట్రవర్షియల్ పోస్టులు, కామెంట్లు చేయడం ఇటీవల కాలంలో తగ్గించారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీస్ కేసులు కూడా అయ్యాయి. తాజాగా మరో పోలీస్ కేసు ఆర్జీవీపై నమోదైంది. విలక్షణ దర్శకుడు RGVపై రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
Also read: Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
— Swathi Reddy (@Swathireddytdp) April 9, 2025
మత ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తున్న రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ @RGVzoomin #LatestNews #Rajahmundry pic.twitter.com/Rr8O1PB3a5
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వేదికగా ఆర్జీవీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ పురాణాలు, భారతీయ సైనికులపై RGV అసభ్యకరమైన వాఖ్యలు చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయన ఆంధ్రా, తెలంగాణ ప్రాంతీయ విభేదాలు కూడా రెచ్చగొడుతున్న చెప్పారు. ప్రజలను ఉసిగొలుపుతున్న డైరెక్టర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాజమండ్రి 3టౌన్ పీఎస్‌లో మేడా శ్రీనివాస్ కేసు పెట్టారు. రెండు నెలల క్రితం ఆర్జీపీపై అనేక పోలీస్ కేసులు నమోదైయ్యాయి. గతంలో చంద్రబాబు, టీడీపీపై ఆయన అణుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులు ప్రస్తుతం కోర్టులో విచారణ కూడా జరుగుతుంది.