/rtv/media/media_files/2025/10/18/case-registered-against-director-ram-gopal-varma-in-rajamahendravaram-2025-10-18-10-10-38.jpg)
Case registered against director Ram Gopal Varma in Rajamahendravaram
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. హిందూ ఇతిహాసాలు, దేవతలు, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆర్జీవీతో పాటు ఆయనకు ఇంటర్వ్యూ చేసిన యాంకర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదు చేసిన మేడా శ్రీనివాస్
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని కలిగించేలా, ముఖ్యంగా యువతను పెడదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దర్శకుడు #RamGopalVarma మరియు ఒక టీవీ ఛానల్ యాంకర్‌పై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 487/2025 కింద కేసు నమోదు చేసి, IPC 153(A), 295(A), 505(2), మరియు IT Act 67 సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ హిందూ దేవుళ్లు, ఇతిహాసాలు, భారత సైన్యం,…
— Tupaki (@tupaki_official) October 18, 2025
ముఖ్యంగా హిందూ ఇతిహాసాలు, దేవతలను కించపరిచేలా, భారత సైన్యాన్ని, ఆంధ్రులను దూషించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంతేకాక, ఇంటర్వ్యూలో మహిళా యాంకర్ కూడా రాంగోపాల్ వర్మను ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద ప్రశ్నలు అడిగారని, విద్వేషాలను ప్రేరేపించే ఈ వీడియోల వెనుక విదేశీ టెర్రరిస్టుల ప్రమేయం కూడా ఉండొచ్చని మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు.
కేసు నమోదు:
మేడా శ్రీనివాస్ ఫిర్యాదును స్వీకరించిన మూడోపట్టణ పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అనంతరం రాంగోపాల్‌వర్మ వ్యాఖ్యలు సమాజంపై ముఖ్యంగా యువతపై చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆర్జీవీతో పాటు, సదరు ఇంటర్వ్యూను నిర్వహించిన యాంకర్ పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.