Naa Love Story: 'నా లవ్ స్టోరీ' పోస్టర్ రిలీజ్.. ఆర్జీవీ బాటలోనే నయా డైరెక్టర్..!
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు తీస్తున్న మూవీ "నా లవ్ స్టోరీ" సినిమా పోస్టర్ ప్రేమికుల రోజు సందర్భంగా, 'మంగళవారం' సినిమా దర్శకుడు అజయ్ భూపతి రిలీజ్ చేసారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు తీస్తున్న మూవీ "నా లవ్ స్టోరీ" సినిమా పోస్టర్ ప్రేమికుల రోజు సందర్భంగా, 'మంగళవారం' సినిమా దర్శకుడు అజయ్ భూపతి రిలీజ్ చేసారు.
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఒకకేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు సీఐడీ పోలీసులు ఈనెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు.
రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్‌లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ మేరకు 3 ఛీర్స్ అంటూ పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
రాం గోపాల్ వర్మకి ఏపీ సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొందరి మనోభావాలు దెబ్బతీసేలా తీశారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
ఆర్జీవీపై గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ నేడు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో పోలీసులు ఆర్జీవీని విచారిస్తున్నారు. ఆయన బయటకొచ్చాక ఏ ఏ విషయాలపై విచారించారో తెలుస్తుంది.
సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసుల తీరుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఓ ప్రతినిధిని నియమించి ఎప్పటికప్పుడు కేసు వివరాలను మీడియాకు వివరించవచ్చు కదా? అని ప్రశ్నించారు. అలా చేయడం ద్వారా వదంతులను నివారించవచ్చన్నారు.
జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు డైరెక్టర్ ఆర్జీవీ. శ్రీదేవిని దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు.