Shivaji Controversy: నీతులు నీ ఇంట్లో వాళ్లకు చెప్పుకో.. ఆర్జీవీ మళ్లీ గెలికేసాడు..!

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో వివాదంగా మారాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా, తాజాగా రాంగోపాల్ వర్మ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. మహిళల వ్యక్తిగత ఎంపికలపై ఎవరికీ తీర్పు చెప్పే హక్కు లేదని ఆయన అన్నారు.

New Update
Shivaji Controversy

Shivaji Controversy

Shivaji Controversy: హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై గాయని చిన్మయి, మంచు లక్ష్మి, అనసూయ భరద్వాజ్ లాంటి వారు తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఈ లిస్టులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) కూడా చేరారు. తనదైన స్టైల్‌లో శివాజీ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.

ఈ వివాదానికి కారణం దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ కార్యక్రమంలో మాట్లాడిన శివాజీ, హీరోయిన్లు సంప్రదాయ దుస్తులు వేసుకోవాలని, గ్లామర్ పేరుతో పొట్టి బట్టలు ధరించకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆ సమయంలో ఆయన వాడిన కొన్ని పదాలు చాలా మందిని బాధించాయి. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. మహిళల స్వేచ్ఛను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. మంచు లక్ష్మి తన సోదరుడు మంచు మనోజ్‌ను ప్రశంసిస్తూ చేసిన ఒక ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, శివాజీ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబట్టారు. మహిళలు ఎలా ఉండాలి, ఎలా దుస్తులు వేసుకోవాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదని వర్మ స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి తన ఇష్టం, తన నిర్ణయం ఉంటుందని, వాటిపై ఇతరులు తీర్పు చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు.

ఇతరుల వ్యక్తిగత ఎంపికలపై నీతులు చెప్పడం తప్పని, ముఖ్యంగా మహిళల విషయంలో ఇలాంటి మాటలు బాధ కలిగిస్తాయని ఆర్జీవీ తనదైన పదజాలంతో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు మరోసారి మహిళల గౌరవం, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులపై చర్చను తెరపైకి తీసుకొచ్చాయి.

శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది. సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ముందు రోజుల్లో దీనిపై ఇంకెంత మంది స్పందిస్తారో, శివాజీ మళ్లీ ఏమైనా క్లారిటీ ఇస్తారో చూడాలి.

Advertisment
తాజా కథనాలు