AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు

సినీ దర్శకుడు రాంగోపాల వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

New Update
RGV

RGV

కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశారని, ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్పటికి సీఐడీ అధికారులు రెండుసార్లు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 10న మొదటిసారి నోటీసులు జారీ చేశారు. కానీ వర్మ విచార‌ణ‌కు వెళ్ళలేదు. మార్చి 5న కూడా మళ్ళీ సీఐడీ నోటీసులు పంపించింది. ఇక, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై గతంలో సోషల్‌ మీడియాలో వర్మ పెట్టిన పోస్టులపై కూడా కేసులు నమోదు అయ్యాయి. 

తొందరపాటు వద్దు..

ఈ నేపథ్యంలో తాజాగా రాంగోపాల వర్మకు సీఐడీ విచారణకు రావాలంటూ మరోసారి నోటీసులు పంపించింది. అయితే ఈ నోటీసులపై ఆయన ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై నిన్న కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకో వద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. దాంతో పాటూ ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. 

today-latest-news-in-telugu | rgv | cid | andhra-pradesh | high-court 

Also Read: Waqf Bill: వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం

Advertisment
తాజా కథనాలు