RGV Review: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో!

తేజా సజ్జా ' మిరాయ్' సినిమా విడుదలైన మొదటి షో నుంచే  సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్, బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ కూడా మిరాయి సినిమాపై ప్రశంసలు కురిపించారు.

New Update

RGV Review: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యంగ్ హీరో తేజా సజ్జా నటించిన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'మిరాయ్' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుంచే  సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్, బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు చెబుతున్నారు. యాక్షన్, ఎలివేషన్స్, డివోషన్, ఎమోషన్ అన్ని కలగలిపిన మిరాయి అని అంటున్నారు.

బహుబలి తర్వాత ఇదే

ఈ నేపథ్యంలో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా మిరాయ్  సినిమాపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి  'బాహుబలి'  తర్వాత ఆ రేంజ్ లో అందరిని మెప్పించిన సినిమా మిరాయ్ అని ప్రశంసించారు. ఆర్జీవీ తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు.. ''ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజ సజ్జా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి బిగ్ షౌటవుట్! బాహుబలి తర్వాత వచ్చిన మరే ఇతర చిత్రానికి ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ నేను వినలేదు. సినిమా కథనం, వీఎఫెక్స్ రెండూ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్ కలిగి ఉన్నాయి''  అంటూ చిత్రబృందాన్ని అభినందించారు ఆర్జీవీ. 

స్మాల్ స్కెల్ బడ్జెట్ అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్స్ పై ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ప్రతీ ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్తీక్ టెక్నీకల్ బ్రిలియన్స్ నెక్స్ట్ లెవెల్ అని కొనియాడుతున్నారు. తక్కువ బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అందించారని ఫిదా అవుతున్నారు. తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రేయా, జగపతి బాబు, జయరామ్ ఇతర నటీనటులు పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. 

సినిమా కథేంటి.. 

కళింగ యుద్ధం తరువాత అశోకుడు తనలోని జ్ఞానాన్ని, దివ్య శక్తిని తొమ్మిది గ్రంథాలలో దాచి వాటిని కాపాడే బాధ్యత తొమ్మిది మంది యోధులకు ఇస్తాడు. అయితే కొన్ని శతబ్దాలు దాటిన తరువాత ఈ శక్తివంతమైన గ్రంథాల గురించి తెలుసుకున్న మహా వీర్ లామా అనే దుష్ట శక్తి.. వాటిని  సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సూపర్ యోధ ( తేజ) దుష్ట శక్తి ( మనోజ్) నుంచి ఎలా రక్షించాడు అనేది సినిమా కథలో చూపించారు.  

హనుమాన్ తర్వాత మిరాయ్ తో తేజ సజ్జ ఖాతలో మరో బ్లాక్ బస్టర్ పడింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు తేజ.  

Also Read: Mirai Review: మళ్ళీ హిట్ కొట్టిన తేజ సజ్జా..మిరాయ్ గూస్ బంప్స్ గ్యారంటీ అంటూ రివ్యూలు

Advertisment
తాజా కథనాలు