RGV : పోలీసులే భయపడితే..  హారర్ కామెడీ సినిమా చేస్తున్న.. ఆర్జీవీ సంచలన ప్రకటన

నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

New Update
rgv new movie

rgv new movie

నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలకు భయం వేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు.. అలాంటిది మరి పోలీసులే భయపడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చేయబోతున్నట్లుగా వెల్లడించారు.  

 ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత

తాను ఇంతవరకు హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌ లాంటి సినిమాలు చేసాను. కానీ ఎప్పుడూ కూడా  హార్రర్ కామెడీ చేయలేదు. అందుకే ఈ చిత్రానికి ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can't Kill The Deadతో అనే టైటిల్ పెట్టానన్నారు.  ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్  హాంటెడ్ స్టేషన్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తారంటూ ఆర్జీవీ సినిమా కాన్సెప్ట్‌ను కూడా వెల్లడించారు.

సత్య, కౌన్ స్కూల్ తర్వాత తాను బాజ్‌పేయి మనోజ్ ఇద్దరం కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లుగా ఆర్జీవీ తెలిపారు. శారీ అనే చిత్రం తరువాత ఆర్జీవీ నుంచి మళ్లీ సినిమా రాలేదు.  దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది.  

Also read : TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

Advertisment
తాజా కథనాలు