RGV Post: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్!

ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన  'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట  ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.

New Update

RGV Post: ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన  'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట  ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలే వైరల్ అవుతున్నాయి. చికిరి సిగ్నేచర్ స్టెప్పుకు రీల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, జానీ కొరియోగ్రఫి ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. 

ఆర్జీవీ ట్వీట్ 

తాజాగా దర్శకుడు ఆర్జీవీ కూడా  'చికిరీ'  పాటపై ప్రశంసలు కురిపించారు. 'పెద్ది'  పాటను ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. హీరోను ఎలివేట్ చేయడమే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరెక్షన్ టీమ్స్ ముఖ్య ఉద్దేశం. 'పెద్ది'లోని 'చికిరి' చరణ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు అంటూ ప్రశంసించారు. భారీ సెట్లు, వందలాది మంది డాన్సర్లు పై కాకుండా ప్రేక్షకుల ద్రుష్టి హీరో పైనే ప్రేక్షకుల దృష్టి పడేలా చేసినందుకు దర్శకుడు బుచ్చిబాబును కొనియాడారు. ఒక స్టార్ తన చుట్టూ మెరుపులు ఉన్నప్పుడు కాదు, సహజంగానే ఎక్కువ ప్రకాశిస్తాడన్న విషయాన్ని డైరెక్టర్ అర్థం చేసుకున్నారని అన్నారు. 

సడెన్ ఛేంజ్ !

అయితే ఆర్జీవీ..  మొన్న చిరంజీవికి సారీ, ఈరోజు రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా  'శివ' రీరిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆర్జీవిని దీని గురించి ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా తోసిపుచ్చారు. ‘సడెన్‌గా ఎందుకు ఇంత ప్రేమ ఏంటీ? అని అడగ్గా.. దాని గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదని దాటేశారు. ఆర్జీవీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీని విభేదిస్తూ వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఆయన్నుంచి సడెన్ గా ఇలాంటి స్పందన రావడంతో అందరూ షాకవుతున్నారు. 

Also Read: Dharmendra : మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!

Advertisment
తాజా కథనాలు