Wall collapses: వర్షానికి కుప్పకూలిన 200 అడుగుల కోట గోడ (VIDEO)
రాజస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రక కట్టడాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. జైపూర్ నగరంలోని ప్రఖ్యాత అమెర్ ఫోర్ట్ వద్ద 200 అడుగుల పొడవైన గోడ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.