/rtv/media/media_files/2025/10/28/dinner-2025-10-28-19-37-02.jpg)
Gujarat Tourists Dine And Dash Without Paying 10,900 rupees
కొందరు ఆకతాయిలు హోటల్‌లో భోజనం చేసి బిల్లు కట్టకుండా పారిపోతుంటారు. ఇలాంటి తప్పు చేస్తూ దొరికిపోయిన వాళ్లకి బడిత పూజ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసిన అమ్మాయిలకు బిల్లు రూ.10 వేలు అయ్యింది. బిల్లు కట్టకుండా పారిపోయేందుకు యత్నించిన ఆ అమ్మాయిలకు ఊహించని షాక్ తగిలింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని మౌంట్ అబు సమీపంలో ఓ హోట్‌ల్‌లో గుజరాత్‌కు చెందిన అయిదుగురు అమ్మాయిలు వచ్చారు. అందరూ ఖరీదైన ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆరగించారు. బిల్లు మొత్తం రూ.10,900 అయ్యింది.
Also Read: 15 మంది మహిళల న్యూడ్ వీడియోస్.. హత్య కేసులో సంచలన విషయాలు!
దీంతో బిల్లు ఎగ్గొంట్టేందుకు అమ్మాయిలు ప్లాన్ వేశారు. టాయిలెట్ వెళ్తానని చెప్పి ఒకరి తర్వాత ఒకరు మెల్లగా రెస్టారెంట్ బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కారులో పారిపోయేందుకు యత్నించారు. కానీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వీళ్లను ముందు నుంచి గమనిస్తున్న హోటల్ యజమాని, వెయిటర్ వాళ్లను వెంబడించారు. గుజరాత్-రాజస్థాన్ సరిహద్దు అంబాజీ వైపు వాళ్ల కారు వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తెలుసుకున్నారు.
Also Read: ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం.. మహాఘఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదల..
పోలీసుల సాయంతో ఆ అయిదుగురు అమ్మాయిలను అక్కడిక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత తమ స్నేహితుడికి ఫోన్ చేసి చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించాలని అడిగారు. చివరికి బిల్లు కట్టాల్సి వచ్చింది. వాళ్లు రోడ్డుపై దొరికిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయిలపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This woman ate food worth ₹10,900 in a hotel with her friends on Ambaji Road, Gujarat.
— ︎ ︎venom (@venom1s) October 27, 2025
Then she ran away without paying the bill in a luxury car.
With police help, the restaurant manager caught them, and she finally paid the bill.
pic.twitter.com/9HZ7bIEhfr
Follow Us