Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్‌సింగ్ ట్రామా సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది.

New Update
Fire Accident

Fire Accident

రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్‌సింగ్ ట్రామా సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ICUలో 11 మంది చికిత్స తీసుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

Also Read: బీహార్ లో ఈసారి సీన్ రివర్స్.. గేమ్ ఛేంజర్ గా ప్రశాంత్ కిషోర్ .. మారిన లెక్కలివే!

షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత మరో 14 మంది రోగులను ఇతర ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఐసీయూలో ఉన్నవారు అందులోనే ఇరుక్కుపోయారు. ఈ క్రమంలోనే భారీగా ప్రాణనష్టం సంభవించింది. మంటలు ఆర్పేసేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించారు. 

Also Read: షాకింగ్ వీడియో.. ఘోరమైన యాక్సిడెంట్ - ముగ్గురు టీచర్లు సహా ఐదుగురు మృతి

Advertisment
తాజా కథనాలు