/rtv/media/media_files/2025/11/09/fotojet-2025-11-09t112725-503-2025-11-09-11-27-47.jpg)
The vegetable vendor became rich overnight..what does that mean?
Amit Sehra: గ్రామంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఓ నిరుపేద కూరగాయల వ్యాపారికి అదృష్టం తలుపుతట్టింది. అంతే ఒక రాత్రిలోనే అతని దశ తిరిగింది. ధనవంతుడిగా మారాడు. ఒక్క లాటరీ టికెట్ అతన్ని ఐశ్వర్యవంతుడిగా మార్చింది. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా (32) పేరు ఇపుడు అందరి నోట నానుతున్నాడు. కారణం సాధారణ జీవితాన్ని గడిపే అమిత్.. ఇటీవల పంజాబ్‌లో రూ.11 కోట్ల విలువ చేసే లాటరీ గెలుచుకున్నారు. దీంతో ఆయన దశ తిరిగింది. ఒక్కరాత్రిలోనే ధనవంతుడిగా మారాడు. దీంతో ఆయన సంతోషానికి అవధులు లేవు.
కోట్‌పుత్లికి చెందిన అమిత్ నెహ్రా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంటారు. అదే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఇటీవల ఆయన పంజాబ్‌లోని బఠిండా ప్రాంతంలో రూ.500కి ఒక లాటరీ టికెట్ (టికెట్ నంబర్ A438586) కొనుగోలు చేశారు. అక్టోబర్ 31 సాయంత్రం లూధియానాలో లాటరీ డ్రా తీశారు. ఈ డ్రాలో మొదటి బహుమతిగా రూ.11 కోట్లు ప్రకటించగా, అది అమిత్ కు దక్కింది. దీంతో ఆయన అదృష్టం మారిపోయింది.
అయితే ఈ లాటరీ టికెట్ కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన తన స్నేహితుడు ముఖేష్ సేన్ దగ్గర నుంచి రూ.500 అప్పు తీసుకున్నానని చెప్పడం విశేషం. గెలుపు ప్రకటించిన తర్వాత అమిత్ కుటుంబంతో కలిసి బఠిండాకు వెళ్లి లాటరీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిచేసుకున్నారు. అనంతరం ఇటీవల కోట్‌పుత్లికి తిరిగి వచ్చినప్పుడు, ఆయనకు ఘన స్వాగతం లభించింది. బండ్లు, మిఠాయిలతో ఆయనను ఆహ్వానించారు. మొత్తం పల్లె ఆనందంలో మునిగిపోయింది.
ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. 'నా గెలుపులో నా స్నేహితుడు ముఖేష్ సేన్‌కి ప్రధాన పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన వల్లనే నేను టికెట్ కొనగలిగాను. అందుకే ఆయన కుమార్తెలిద్దరికీ తలా 50 లక్షల చొప్పున ఒక కోటి రూపాయలు ఇస్తాను అని తన పెద్ద మనసు చాటు కున్నాడు. వారు మంచి చదువులు చదవుకోని జీవితంలో ముందుకు సాగాలి. అన్నాడు. టికెట్ కొనుగోలు చేసినప్పుడు నా అదృష్టం ఇలా మారుతుందని నేను ఊహించలేదు. నా పిల్లల చదువుతో పాటు ఇతర పేద పిల్లల విద్య ఖర్చు కూడా నేను చూసుకుంటాను' అని చెప్పి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
అయితే తన కష్టాలన్నీ పోయాయి అనుకోని హ్యాపీగా ఉందామనుకుంటున్న ఆయనకు మోసగాళ్ల బెడద ఎక్కువైంది. లాటరీతో అమిత్ పేరు చర్చనీయాంశంగా మారడంతో మోసగాళ్లు ఆయనపై దృష్టి సారించారు. అమిత్‌కి అనేక తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. కొందరు తమను లాటరీ కంపెనీ లేదా ప్రభుత్వ అధికారులు అని పరిచయం చేసుకుంటూ పన్ను, క్లెయిమ్ ఫీజు లేదా దానం పేరుతో డబ్బు అడుగుతున్నారు. కొందరు బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అమిత్ తన మొబైల్ ఫోన్‌ను ఆఫ్ చేసి కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు.
Also Read : సీఎం..నీ వీధి రౌడీ భాష మార్చుకో!..కవిత మాస్ వార్నింగ్
Follow Us