Girl Dies of Cardiac Arrest : రాజస్థాన్‌లో విషాదం..9 ఏళ్ల బాలికకు కార్డియాక్‌ అరెస్ట్‌

వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో అలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. స్థానిక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక దివ్య ఆడుకుంటూ కార్డియాక్‌ అరెస్ట్‌ తో కుప్పకూలి మరణించింది.

New Update
FotoJet (5)

Girl Dies of Cardiac Arrest

Girl Dies of Cardiac Arrest : వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తు్న్నాయి.  రాజస్థాన్‌లో అలాంటి విషాదకర ఘటనే చోటుచేసుకుంది. స్కూల్‌లో ఆడుకుంటూ 9 ఏళ్ల బాలిక కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా గోటన్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర బపేడియా అనే వ్యక్తి కుమార్తె దివ్య (9) స్థానిక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం దివ్య ఎప్పటిలాగే ఉత్సాహంగా పాఠశాలకు వెళ్ళింది. ఉదయం ప్రార్థన సమయానికి ఇంకా టైం ఉండటంతో పాఠశాల గ్రౌండ్‌లోనే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఇలా ఆడుకుంటున్న సమయంలోనే దివ్య ఉన్నట్లుండి కుప్పకూలింది. స్పృహ తప్పి కింద పడిపోవడంతో తోటి విద్యార్థులు గుర్తించి టీచర్లకు సమాచారం ఇచ్చారు.

వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది ఆ బాలికను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, కార్డియాక్ అరెస్ట్‌ వల్లే మరణించి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.  ఫిబ్రవరి 23న జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా గత సెప్టెంబర్ 9వ తేదీన దివ్య అన్నయ్య అభిషేక్ కూడా సరిగ్గా ఇదే రీతిలో మృతి చెందటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అభిషేక్ ఇంట్లో ఆడుకుంటూ అకస్మాత్తుగా కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అతనిది కూడా కార్డియాక్‌ అరెస్ట్‌ వల్లే మరణించినట్లు వైద్యులు తెలపడం గమనార్హం.  కాగా తమ ఇద్దరు బిడ్డలు ఒకే తరహాలో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు