/rtv/media/media_files/2025/09/24/newborn-found-in-rajasthan-2025-09-24-10-38-33.jpg)
మానవత్వం మంటగలిసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 15 రోజుల వయసున్న ఓ పసికందును అనాగరికంగా అడవిలో వదిలివేసిన సంఘటన కలకలం రేపింది. అంతేకాకుండా, ఆ శిశువు నోటిని గ్లూతో అతికించి, ఏడుపు శబ్దం బయటకు రాకుండా ఒక రాయిని ఉంచారు. అది చూసిన పోలీసులు, స్థానికులు షాక్‌కు గురైయ్యారు.
A 15-day-old baby was found abandoned in a Rajasthan's forest, his mouth sealed with glue and a stone to silence his cries. In a society grappling with its demons, this act is a chilling reminder of the evil that exists. But it’s also a story of hope. A local herder found the… pic.twitter.com/3q7AIMo6fv
— Trend Pulse (@Trend_Pulse7) September 24, 2025
ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని సవై మాధోపూర్ జిల్లాలో జరిగింది. రణతంబోర్ అడవి సమీపంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులకు అడవిలోంచి పసికందు ఏడుపు వినిపించింది. వారు సమీపంలోకి వెళ్లి చూడగా, 15 రోజుల శిశువు ఏడుస్తూ కనిపించింది. అయితే, ఆ పసికందు ఏడుపు బయటకు వినిపించకుండా దాని నోటికి గ్లూ అతికించి, దానిపై ఒక రాయిని పెట్టారు. ఇది చూసిన వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ పసికందును రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పసికందు నోటికి ఉన్న గ్లూను జాగ్రత్తగా తొలగించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ పసికందు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ పసికందును అడవిలో వదిలివేసిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అమానుష చర్యపై స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.