Chemical Foctory Accident: కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..  స్పాట్ లో 8 మంది కార్మికులు

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భివాడి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనం కాగా.. మరో 10 మందికి పైగా ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

New Update
FotoJet (7)

Chemical Foctory Accident

Chemical Foctory Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భివాడి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనం కాగా.. మరో 10 మందికి పైగా ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తు్న్నారు.

భివాడిలోని ఖైర్తల్-తిజారాలోని ఖుస్ఖేడ కరౌలి పారిశ్రామిక ప్రాంతంలోని ఒక రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20-25 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని ఖైర్తాల్-తిజారా జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో సంభవించింది. మంటలు క్షణాల్లో ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 8మంది  వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది భారీ యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

కాగా, రెస్క్యూ సిబ్బంది  మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో  సహయ చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే  ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా, రసాయనాలు నిల్వ ఉంచిన చోట అగ్నిప్రమాదం చోటు చేసుకుందా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు