Rajastan Bus Fire accident: రాజస్థాన్ బస్సు ప్రమాదం.. 20కి చేరిన మృతుల సంఖ్య.. ఆకస్మిక మంటలకు కారణమిదే!

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ బస్సులో ఆకస్మిక మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. ఇప్పుడు మృతులు సంఖ్య 20కు చేరింది. జోధ్‌పూర్ వెళ్లే హైవేపై మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Rajastan

Rajastan

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ బస్సులో ఆకస్మిక మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. ఇప్పుడు మృతులు సంఖ్య 20కు చేరింది. జోధ్‌పూర్ వెళ్లే హైవేపై మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందడంతో పాటు మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ బస్సులో దాదాపుగా 55 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే బస్సులో మంటలు వచ్చిన వెంటనే అందులో ఉన్నవారిని కాపాడటానికి ఆ డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ అప్పటికే కొందరు ఆ మంటల్లో సజీవ దహనం అయ్యారు.

ఇది కూడా చూడండి: Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!

కొన్ని నిమిషాల వ్యవధిలోనే..

మరికొందరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే 10 నుంచి 15 మంది గాయపడినట్లు అనుకున్నారు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణాలు పెరిగాయి. అయితే ఈ మంటలు సడెన్‌గా బస్సులో ఎందుకు వచ్చాయనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బస్సు నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా? లేకపోతే సాంకేతిక సమస్యలా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పండుగ సమయంలో సాధారణంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇలా బస్సులో మంటలు ఆకస్మికంగా రావడంతో ప్రయాణికులు ఆందోళన  చెందుతున్నారు. 

ఇది కూడా చూడండి: Bus Fire Accident : ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహానం!

Advertisment
తాజా కథనాలు