PAK: పీవోకేలో మదరసాలు బంద్.. పిల్లలకు అత్యవసర సేవ పాఠాలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన నగరమైన ముజఫరాబాద్ లో చదువులు చెప్పే 1000 మదరసాలు బంద్ అయ్యాయి. అక్కడ పిల్లలకు చదువు బదులుగా అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన నగరమైన ముజఫరాబాద్ లో చదువులు చెప్పే 1000 మదరసాలు బంద్ అయ్యాయి. అక్కడ పిల్లలకు చదువు బదులుగా అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ తీవ్రంగా దాడి చేస్తోంది. ఒకవైపు యుద్ధ సన్నాహాలు చేస్తూనే మరోవైపు నుంచి దౌత్యపరంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్. తాజాగా పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే మాస్టర్ ప్లాన్ తో వస్తోంది .
పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరు నినాదాలు చేస్తే వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌ను పొగిడే వాళ్లు ఈ దేశానికి అవసరం లేదని సీఎం త్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. తనకు ఓ ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అందుకు అనుమతించాలని మంత్రి జమీర్ అహ్మద్ కోరారు
జమ్మూ కాశ్మీర్‌లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.
పాకిస్తాన్ గగనతలం మూసేయడంతో విమానాల రాకపోకలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. దూరాన్ని తగ్గించుకుని..ఖర్చును కూడా తగ్గించుకోవాలని చూస్తోంది.
భారత్, పాకిస్తాన్ ల ఉద్రిక్తత సెగ..మిగతా దేశాలకూ పాకింది. ప్రస్తుతం ఇరు దేశాల తమ గగనతలాల మీద రెస్ట్రిక్షన్స్ విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ గగనతలం వద్దు..భారత్ దే కావాలని విదేశీ విమానయాన సంస్థలు అంటున్నాయి.
బంగ్లాదేశ్ నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్ రెహమాన్ వివాదస్పద పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌పై అటాక్ చేస్తే ఇండియా 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని ఫేస్బుక్లో పేర్కొన్నారు. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని అన్నాడు.