/rtv/media/media_files/2025/05/14/3229ZHmdfDpFuqJkvc46.jpg)
Pakistani High-Commissioner
Honey trap : ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడి భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ మరో వివాదంలో చిక్కుకుంది. బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదం లో చిక్కుకున్నాడు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ప్రైవేటుగా గడిపిన ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సయ్యద్ అహ్మద్ హనీట్రాప్‌లో చిక్కుకున్నారన్న వార్తలు గుప్పుమనడంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
అయితే ఈ వివాదం బయటకు రాగానే అహ్మద్ మరూఫ్ మే 11న ఢాకా విడిచి వెళ్లిపోయినట్లు బంగ్లా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన దుబాయ్ మీదుగా ఇస్తామాబాద్ చేరుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు పాకిస్థాన్ హై కమిషన్ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు చేపట్టారు.
ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
కాగా, మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇటీవల నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఆయన ఆ యువతి వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ సదరు యువతికి చేరవేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
భారత్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో పాక్ తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు పాక్ లో నెలకొన్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇతర దేశాల సాయం కోసం ఎదురుచూస్తుంది. అలాంటి సమయంలో సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం ఆ దేశాన్ని తలెత్తుకోలేని స్థితికి చేర్చింది. ఇప్పటికే గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించింది. ఆయన్ని అవాంఛిత వ్యక్తి గా ప్రకటించి 24 గంటల్లోగా భారత దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది.
ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ