/rtv/media/media_files/2025/05/11/pLb63EE6WboWYSsVSC3r.jpg)
Asaduddin Owaisi
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్‌ను ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేసింది. ప్రస్తుతం అక్కడి రన్ వే పూర్తిగా ధ్వంసమై పని చేయడం లేదు. దీనికి సంబంధించి అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌లపై విమర్శలు గుప్పించారు.
Also Read : టర్కీకి బిగ్‌షాక్.. బాయ్‌కాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్
MIM Chief Asaduddin Tweet
Will S Sharief & A Munir be able to land their Leased Chinese Aircraft at
— Asaduddin Owaisi (@asadowaisi) May 13, 2025
Rahim Yar khan Airbase ?
Also Read : స్టూడెంట్‌తో కంప్యూటర్ టీచర్ రాసలీలలు.. ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మీరు లీజుకు తీసుకున్న చైనా విమానాలను రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ చేయగలరా? అని MIM చీఫ్ ట్వీట్ చేశారు. ఎయిర్ బేస్ కొన్ని రోజులుగా పని చేయడం లేదని తెలిసిందని ట్వీట్‌లో ఆయన అన్నారు. ఈ ఎయిర్‌బేస్ వారం రోజులుగా పనిచేయడం లేదట. అసదుద్దీన్ ఒవైసీ చైనాను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారతదేశంపై అనేకసార్లు దాడి చేసింది. వాటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తత మధ్య చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చింది.
Also Read : వల్లభనేని వంశీకి బెయిల్!
Also Read : పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
(Pakistan Prime Minister | aimim-mla-asaduddin-owaisi | aimim | post | pakistan | india pak war | latest-telugu-news)