/rtv/media/media_files/2025/05/14/UeDdRLA4Io9eZz7Nb90u.jpg)
Randheer Jaiswal
జమ్మూ, కాశ్మీర్ ఎప్పటికీ భారత్ దే అంటోంది విదేశాంగ శాఖ. దీనిపై భారత్ వైఖరి మారేదే లేదని చెప్పింది. ప్రధాని మోదీ చెప్పిన విషయాలపై విదేశాంగ శాఖ మరోసారి ధ్రువీకరించింది. జమ్మూ, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో భారత్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని అనుకుంటోందని తెలిపింది. ఈ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. ఇంతకుముందు కూడా పాక్ మధ్యవర్తిత్వం కోరింది. అమెరికా కూడా రెండు, మూడు సార్లు జోక్యం చేసుకోవాలని చూసింది. కానీ దానిని భారత్ ఎప్పటికీ ఒప్పుకోదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.
కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన సమస్యలను భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.
#WATCH | Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "We have a long-standing national position that any issues pertaining to the Union Territory of Jammu and Kashmir have to be addressed by India and Pakistan bilaterally. That stated policy has not changed. The outstanding… pic.twitter.com/gsbwsFF36l
— ANI (@ANI) May 13, 2025
మరోసారి దాడి జరిగితే..
అంతకు ముందు ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి ఇవ్వడం తప్ప, కాశ్మీర్‌పై ఎటువంటి చర్చలు సాధ్యం కాదని ప్రధానమంత్రి అన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని ఆయన స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందం తిరిగి కావాలనుకుంటే పాక్ కాశ్మీర్ విషయంలో రాజీకి రావాల్సిందేనని చెప్పారు. మనం ఎప్పుడైనా పాకిస్తాన్‌తో మాట్లాడితే, అది ఉగ్రవాదం మరియు పీఓకే గురించి మాత్రమే అని ప్రధాని అన్నారు. పహల్గాం దాడిలాంటివి పునరావృతం అయితే ఈసారి భారత్ ఉగ్రరూపం చూస్తారని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నట్టుగా ఈ విషయంలో తాము ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు.
today-latest-news-in-telugu
Also Read: Trump: వాణిజ్య ఒప్పందాలతోనే కాల్పుల విరమణ..ట్రంప్ అదే పాట