Chenab River: జమ్మూకశ్మీర్లో వరదలు.. బాగ్లిహర్, సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత
జమ్మూకశ్మీర్లోని రాంబన్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహర్ డ్యామ్, అలాగే సలాల్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. ఇటీవలే సింధూ నది ఒప్పందం నిలిపివేయండంతో ఆ డ్యామ్ గేట్లను మూసేశారు.