Pakistan: ఆ మూడింటిని భారత్ తో చర్చించేందుకు సిద్ధం..పాక్ ప్రధాని
పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. కాశ్మీర్, సింధు జలాలు, ఉగ్రవాదంపై భారత్ చర్చించేందుకు సిద్ధమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.