/rtv/media/media_files/2025/10/13/tlp-leader-dead-2025-10-13-16-26-44.jpg)
TLP protest
Pakistan: లాహోర్‌లో యాంటీ ఇజ్రాయెల్ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ఆందోళన చేస్తున్న టీఎల్‌పీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్థాన్ మద్దతుదారులపై పాక్ భద్రతాదళాలు విరుచుకుపడ్డాయి. ఇస్లామాబాద్ వైపు దూసుకువస్తున్న ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. ఆందోళనకారులపైకి పాకిస్థాన్ పోలీసుల కాల్పులు జిరిపారు.ఆ ఘర్షణల్లో ఓ ఆఫీసర్‌తో పాటు అనేక మంది నిరసనకారులు మరణించినట్లు తెలుస్తోంది.కాల్పుల్లో TLP చీఫ్ సహా పలువురు ఆందోళనకారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
లాహోర్ సమీపంలో ఈ ఆందోళన జరిగింది. పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వార్ మాట్లాడుతూ.. భద్రతా దళాలపై ఆందోళనకారులు ఫైరింగ్ జరిపినట్లు పేర్కొన్నారు. దీంతో ఓ ఆఫీసర్ మృతిచెందినట్లు చెప్పారు. అయితే ఎంత మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారో చెప్పలేదు. టీఎల్‌పీ చీఫ్ సాద్ రిజ్వీ కూడా ఆ కాల్పుల్లో గాయపడటం లేదా మరణించినట్లు తెలుస్తోంది. అతనికి బుల్లెట్లు దిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉందని ప్రచారం సాగతోంది.
ముర్దికే వద్ద జరిగిన కాల్పుల్లో ఓ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టీఎల్‌పీ పార్టీ శుక్రవారం తమ ఆందోళనలు మొదలుపెట్టింది. ఇస్లామాబాద్‌లో ఉన్న అమెరికా ఎంబసీ ముందు గాజా, పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన చేపట్టాలని భావించింది. అయితే ఆదివారం పాకిస్థాన్ భద్రతా దళాలు.. ముర్దికే వద్ద టీఎల్‌పీ నిరసనకారుల్ని చుట్టుముట్టారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిరసనకారుల్ని తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడ హింస చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. --- లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, మురిద్కెలో తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పులతో ఆందోళనకారులు మరంత రెచ్చిపోయారు. పలు--- వాహనాలకు నిప్పు పెట్టారు.--- పోలీసులను ఉరికించి కొట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు..58 మంది సైనికులు మృతి ?
మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో, ఖతార్, సౌదీ అరేబియా జోక్యంతో ఆదివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, అంతకుముందు జరిగిన ప్రతీకార దాడుల్లో 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని కాబూల్ ప్రకటించింది. దీంతో సరిహద్దు క్రాసింగ్‌లను పాకిస్తాన్ మూసివేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌తో పాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని ఖండిస్తూ, ఆ దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని ఆయన వెల్లడించారు. అలాగే, పాకిస్థాన్‌కు చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ముజాహిద్ తెలిపడం గమనార్హం.
దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న రెండు ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌లైన తోర్ఖం, చమన్‌లను ఆదివారం మూసివేశారు. ఇతర చిన్న క్రాసింగ్‌లను కూడా నిలిపివేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు వైపులా ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘన్ దళాలకు ఐదుగురు పాకిస్థాన్ సైనికులు లొంగిపోయారని కూడా టోలో న్యూస్ వివరించింది. రెండు దేశాల మీడియా సంస్థలు కూడా పరస్పరం ఎదుటి పక్షానికి భారీ నష్టం వాటిల్లిందని ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. పాకిస్థాన్ మీడియా సంస్థలు అనేక ఆఫ్ఘన్ పోస్టులు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ సైనికులు మరణించారని పేర్కొనగా, ఆఫ్ఘన్ వర్గాలు పాకిస్థాన్ ట్యాంకును స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నాయి. ఇస్లామాబాద్ అధికారికంగా మరణాల సంఖ్యను ప్రకటించనప్పటికీ, తమ భద్రతా దళాలకు ప్రాణనష్టం జరిగిందని ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: నేపాల్ జైలు నుంచి తప్పించుకుని భారత్ లోకి పాక్ మహిళ.. ఆమె లక్ష్యం ఏంటి?