Protests in Pakistan: పాలస్తీనా హ్యాపీ.. పాకిస్తాన్ అగ్నిగుండం

గాజాలో మరణాలు, ట్రంప్‌ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తెహ్రీక్‌-ఇ-లబైక్‌ పాకిస్థాన్‌ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ అగ్నిగుండమవుతోంది. గాజా యద్ధం ముగిసిందన్న సంతోషంతో పాలస్తీనా ప్రజలుంటే.. పాక్‌లో మాత్రం హింస చెలరేగడం గమనార్హం.

New Update
Protests in Pakistan

Protests in Pakistan

Protests in Pakistan: "చెరపకురా చెడెవు' అన్నది నానుడి. ఇతరులను ఇబ్బంది పెడితే మనకూ ఇబ్బంది తప్పదన్నది దాని అర్థం. పాకిస్తాన్‌ పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలను హరిస్తూ వస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌ ఇప్పుడు సొంత దేశాస్తుల ఆందోళనతో అట్టుడుగుతోంది. గాజాలో మరణాలు, ట్రంప్‌ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్‌-ఇ-లబైక్‌ పాకిస్థాన్‌ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ అగ్నిగుండమవుతోంది. గతవారం రోజులుగా దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడసికొట్టడంతో పాటు ఆందోళనకారులు పోలీసులపై తిరగబడటంతో  ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారి సహా పలువురు ఆందోళన కారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గాజా యద్ధం ముగిసిందన్న సంతోషంతో  పాలస్తీనా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. పాక్‌లో మాత్రం హింస చెలరేగడం గమనార్హం.

Also Read:  Cough Syrup Tragedy: దగ్గుమందు మరణాలు.. కంపెనీకి బిగ్ షాక్..

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా టీఎల్‌పీ లాహోర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ ముట్టడించేందుకు యత్నించింది. అయితే ఆందోళన కారులను అడ్డుకునేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. పంజాబ్ పోలీస్‌ చీఫ్ ఉస్మాన్ అన్వర్ మాట్లాడుతూ.. పోలీసులపై ఆందోళనకారులు కాల్పులు జరిపారని ఆరోపించారు.దీంతో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు మరణించారన్నారు.  మరోవైపు తమ మద్దతుదారులు అనేకమంది మరణించడం, లేదా గాయపడడం జరిగిందని టీఎల్‌పీ వెల్లడించింది. 

పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్‌పీ చీఫ్ సాద్‌ రిజ్వీ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులకు విన్నవించినట్లు కనిపిస్తోంది. అధికారులతో చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో తుపాకీ పేలుళ్ల శబ్దం కూడా  వినిపించింది. మరొక వీడియోలో.. పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్న దృశ్యాలున్నాయి. ఆందోళనకారులు ఇస్లామాబాద్ వైపుగా వెళ్లకుండా రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా పెట్టినట్లు కనిపిస్తోంది. వాటిని తొలగించడంతో తాజాగా మరోమారు ఘర్షణలు చెలరేగాయి. 

అయితే టీఎల్‌పీ ప్రదర్శనలపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తోన్న సమయంలో టీఎల్‌పీ ఆందోళనలకు దిగడాన్నిపలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడ శాంతి నెలకొనడం వారికి ఇష్టం లేదేమో అని అభిప్రాయపడుతున్నారు. గాజాలో శాంతి ఒప్పందం నేపథ్యంలో వేడుకలు చేసుకోవాల్సిందిపోయి, హింసకు దిగడడం ఎందుకో అర్థం కావడం లేదని పాక్ మంత్రి తలాల్ చౌధరీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇక నిరసన ప్రారంభం కావడానికే ప్రభుత్వం అతిగా ప్రవర్తించిందని, ముందుగానే రోడ్లను దిగ్బందించిందని దానివల్లే హింస చెలరేగిందని మరికొందరు విమర్శిస్తున్నారు.

Also Read :  RSS నుంచి లైంగిక వేధింపులు.. IT ఉద్యోగి సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
తాజా కథనాలు