Taliban And Pakistan:  పాక్-అఫ్గాన్ మధ్య యుద్ధం మొదలైందా?  తాలిబాన్లతో భీకర ఘర్షణ 15 మంది పాకిస్తాన్ సైనికులు మృతి

పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్‌ కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే 15 మంది పాక్‌ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది.

New Update
Pak-Afghan War

Pak-Afghan War

Taliban And Pakistan: పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్‌ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పాక్‌ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు అఫ్గాన్‌ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ వెల్లడించినట్లు పీటీవీ న్యూస్ పేర్కొంది.  

పాక్-అఫ్గాన్ మధ్య యుద్ధం మొదలైందా?  అంటే మొదలైందనే సమాధానం వస్తోంది. దాయాదీ దేశం పాకిస్తాన్‌తో ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా పోరాడుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. పాక్‌కు చెందిన పలు ఆర్మీ పోస్టులను తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఆఫ్గాన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించినట్లు టోలో న్యూస్ తెలిపింది. ఇక కూనార్, హెల్మండ్ ప్రొవిన్స్ లో రెండు పాక్‌ ‌పోస్టులను సైతం ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘాన్‌ వెల్లడించింది. ఇటీవల కాబూల్ పై పాక్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. 

అక్టోబర్ 9న పాకిస్తాన్ జలాలబాద్ ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ చీఫ్ నూర్‌వలి మహమ్మద్ లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 11 నంగరహర పునార్‌ ప్రోవిన్సులో పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడులు ప్రారంభించింది. ఇక పాకిస్తాన్‌కు చెందిన పలు పోస్టులపై ధ్వంసం చేస్తూ వచ్చింది. ఆఫ్గాన్ సరిహద్దు దళాలు, పాకిస్తాన్ దళాల మధ్య ఘర్షణలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘర్షణలో 15 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని మీడియా వెల్లడించింది. 

ఆఫ్గాన్‌ సైనికులు ఇప్పటికే పలువురు పాకిస్తాన్ సైనికుల ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి కాబుల్లో జరిగిన రెండు పేలుళ్ల తర్వాత తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు కూడా చేసింది. పాకిస్తాన్ ఆఫ్గాన్ గగనతలాన్ని ఉల్లంఘించి డ్యూరాండ్ లైన్ సమీపంలో ఉన్న పాక్టికాలోని మార్కెట్ ప్రాంతంపై బాంబు దాడి కూడా చేసింది. ఇది రెచ్చగొట్టే చర్యగా ఆఫ్గాన్ తీవ్రంగా ఖండించింది. దీంతో తిరిగి పాక్‌పై కాల్పులకు దిగింది.

ఇదిలా ఉండగా తాలిబాన్‌ ప్రభుత్వ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలోనే పాక్‌ ఆఫ్గాన్‌ పై ఈ వైమానిక దాడులు నిర్వహించింది. దీనిపై ముత్తాఖీ మాట్లాడుతూ ఆఫ్గాన్‌ ధైర్యాన్ని పరీక్షించకూడదు. భారత్ ,పాక్ రెండిటితోను మేము మంచి సంబంధాలు కోరుకుంటున్నాం. ఏకపక్షం ఉండదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఇలా ఆఫ్గానిస్థాన్ పాకిస్తాన్ మధ్య దాడులు జరగడం ప్రారంభమయ్యాయి.

పాక్ లో ఉగ్రదాడి..

ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్సులో ఉన్న పోలీసు శిక్షణా కేంద్రంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడుల్లో పలువురు పోలీసులు మృతి చెందారు. తర్వాత జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. దీంతో మృతిచెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరుకుంది. దాడి అనంతరం శుక్రవారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో తొలుత ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఆ ప్రాంగణంలో దాక్కుని ఉంటారని అధికారులు అనుమానించారు.  దాంతో ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు పోలీసులు మృతిచెందారని అధికారులు వెల్లడించారు.

అంతకుముందు ఓ పోలీసు మృతిచెందిన విషయం తెలిసిందే. దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య 7కు చేరుకున్నట్లు వెల్లడించారు. శిక్షణార్థులు, మిగిలిన సిబ్బందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలున్న ట్రక్కుతో పోలీసు శిక్షణా కేంద్రం ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. అనంతరం ఉగ్రవాదులు లోపలికి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఐదు గంటల తీవ్ర పోరాటం తర్వాత ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి ఆత్మాహుతి దుస్తులు, పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.  అయితే ఈ ఉగ్రదాడికి కారణం ఎవరనే విషయం ఇంకా వెల్లడికాలేదు.

Also Read: 3 వేల ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్.. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

Advertisment
తాజా కథనాలు