PAK-AFGHAN WAR: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!

ఆఫ్ఘాన్ లో వైమానిక దాడులు చేసి కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగెట్టించి మరీ చంపుతోంది.  దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
pak army

భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అవుతోంది. దీన్ని పక్క దేశం పాకిసతాన్ తట్టుకోలేకపోతోంది. దీంతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ కారణంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్‌ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. అయితే ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ దే పై చేయిగా ఉంది. పాక్ సైన్యాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటి వరకు 15 మంది పాక్ సైనికులను చనిపోయారు. పాక్‌కు చెందిన పలు ఆర్మీ పోస్టులను తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకుందని..ఆఫ్గాన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించినట్లు టోలో న్యూస్ తెలిపింది. కూనార్, హెల్మండ్ ప్రొవిన్స్ లో రెండు పాక్‌ ‌పోస్టులను సైతం ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘాన్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యాన్ని...ఆఫ్ఘాన్ ఆర్మీ పరుగులు పెట్టించి మరీ దాడి చేస్తోంది. ఆఫ్ఘాన్ దెబ్బకు పాక్ సైనికులు ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని మరీ పరుగులు తీశారు. ఆఫ్ఘాన్ బోర్డర్ ను వదిలి తమ వాహనాల్లో పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పాకిస్తానే మొదలెట్టింది..

అక్టోబర్ 9న పాకిస్తాన్ జలాలబాద్ ఆఫ్ఘనిస్తాన్ లోని టీటీపీ చీఫ్ నూర్‌వలి మహమ్మద్ లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 11 నంగరహర పునార్‌ ప్రోవిన్సులో పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడులు ప్రారంభించింది. ఇక పాకిస్తాన్‌కు చెందిన పలు పోస్టులపై ధ్వంసం చేస్తూ వచ్చింది. ఆఫ్గాన్ సరిహద్దు దళాలు, పాకిస్తాన్ దళాల మధ్య ఘర్షణలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘర్షణలో 15 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని మీడియా వెల్లడించింది. 

Also Read: Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడికి క్యాన్సర్.. రేడియేషన్ థెరపీ చికిత్స

Advertisment
తాజా కథనాలు