BREAKING: పాకిస్తాన్‌కు బిగ్‌షాక్..  హ్యాండిచ్చిన సౌదీ ఆరేబియా

ఇటీవల పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ దాడి చేసింది. అయితే సైనిక ఒప్పందాన్ని గుర్తుచేస్తూ తక్షణ సహాయం కోసం పాకిస్తాన్ సౌదీ అరేబియాను సంప్రదించగా సాయం చేయకుండా హ్యాండ్ ఇచ్చింది.

New Update
pak vs saudi arebia

pak vs saudi arebia

పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవల ఓ సైనిక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా.. రెండు కూడా పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అగ్రిమెంట్‌తో పాక్‌కు సౌదీ అరేబియా నుంచి భరోసా అందింది. కానీ సౌదీ అరేబియా హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ దాడి చేసింది. అయితే సైనిక ఒప్పందాన్ని గుర్తుచేస్తూ తక్షణ సహాయం కోసం పాకిస్తాన్ ప్రధాన మంత్రి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు.

ఇది కూడా చూడండి: PAK-AFGHAN WAR: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!

ఇది కూడా చూడండి: Duflo-Banerjee : ట్రంప్ ఆంక్షల ప్రభావం..అమెరికాను వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు

సౌదీ అరేబియా సాయం కోరిన పాక్..

తమపై దాడి జరిగిందని ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా సాయం అందించాలని కోరారు. కానీ పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఈ దాడి విషయంలో పాకిస్తాన్‌కు సాయం అందించడానికి సౌదీ అరేబియా ఒప్పుకోలేదు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి స్పందిస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించాలని మాత్రమే సూచించారు. అంటే తమ ఒప్పందం ప్రకారం సైనిక చర్యకు మద్దతు ఇవ్వడానికి బదులు, శాంతియుత పరిష్కారం వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతోంది. సైనికపరంగా పూర్తి మద్దతు లభిస్తుందని నమ్మిన పాకిస్తాన్‌కు, కీలక సమయంలో సౌదీ కేవలం సంయమనం పాటించమని చెప్పడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Advertisment
తాజా కథనాలు