Afghanistan: 60 మంది పాక్‌ సైనికులు హతం.. అఫ్గానిస్థాన్‌ సంచలన ప్రకటన

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ బలగాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. 58 మంది పాక్ సైనికులను మేము హతమార్చామని అఫ్గానిస్థాన్ ప్రకటన చేసింది. ప్రతీసారి వాళ్లు తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడినందుకే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

New Update
Afghanistan says it has killed 58 Pakistani soldiers in overnight border operations

Afghanistan says it has killed 58 Pakistani soldiers in overnight border operations

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్(afganisthan) బలగాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. 60 మంది పాక్ సైనికులను మేము హతమార్చామని అఫ్గానిస్థాన్ ప్రకటన చేసింది. ప్రతీసారి వాళ్లు తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడినందుకే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు పాకిస్థాన్ ISIS ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోని కాబుల్‌తో పాటు ఓ మార్కెట్‌పై పాక్‌ బాంబు దాడులు చేసినట్లు ఇటీవల అఫ్గానిస్థాన్ ఆరోపణలు చేసింది. 

Also Read: బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్ట్

Afghanistan Says Killed 58 Pakistani Soldiers In Overnight

ఈ క్రమంలోనే పాక్‌ దళాలే టార్గెట్‌గా ఈ ప్రతీకార దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. తమ బలగాలు ఆ దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తాబిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ కాల్పుల్లో 58 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు స్పష్టం చేశారు. అలాగే మరో 30 మంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇటీవల అఫ్గాన్ రాజధాని కాబుల్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి. 

Also Read: ట్రంప్ ఆంక్షల ప్రభావం..అమెరికాను వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు

తెహ్రీక్‌ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్‌ వాలి మెహ్సూద్ స్థావరమే టార్గెట్‌గా పాకిస్థాన్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఈ విషయాన్ని పాక్ రక్షణ శాఖ విశ్లేషణ సంస్థలు కథనాలు ప్రచురించాయి. కానీ ఈ దాడులపై పాకిస్థాన్ మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మరోసారి పాక్, అఫ్గాన్ మధ్య దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అఫ్గాన్‌లోని బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చైనా, పాక్, రష్యాతో పాటు భారత్‌ కూడా ఈ విషయంలో అమెరికా ప్రయత్నాలను ఖండించింది.

Also Read: రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు