Third World War: ఇండియా-యూస్, పాక్-ఆఫ్ఘాన్, రష్యా-ఉక్రెయిన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?

నెమ్మదిగా పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ తో పాటూ ఆప్ఘాన్ లాంటి దేశాలు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది. 

New Update

గత కొన్నేళ్ళుగా ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంది. రెండేళ్ళుగా అవుతున్న ఇజ్రాయెల్, హమాస్ యుద్దానికి తెర పడింది. కానీ మరో వైపు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య అగ్గి రాజుకుంది. అలాగే మూడేళ్ళుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయన్ యుద్ధం కూడా పీక్ చేరుకుంటోంది. ఇప్పటి వరకు యుద్ధాలను ఆపుతాను, ప్రపంచ శాంతే ముఖ్యమని అంటున్న అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్ నె ఎగదోస్తున్నారు. దీంతో ప్రపంచంలో అసలేం జరుగుతోంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే సందేహాలు వెలువడుతున్నాయి. 

ఆఫ్ఘనిస్తాన్ ను రెచ్చగొడుతున్న పాక్..

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ లో పహల్గాందాడి తరువాత ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి వార్ కు తెర దించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోవైపు అప్ఘనిస్తాన్ ను కూడా రెచ్చగొడుతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ కు వచ్చినప్పుడే పథకం ప్రకారం పాకిస్తాన్ దాడి చేసింది. రెండు రోజుల పాటూ ఇరు దేశాల మధ్యనా భీకర యుద్ధం జరిగింది. 200 మంది తాలిబన్లను పాక్ ఆర్మీ చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం..పాక్ ఆర్మీని బోర్డర్ నుంచి తరిమి తరమి కొట్టింది 58 మంది సైనికుల్ని మట్టుబెట్టింది. అయితే ప్రస్తుతానికి వార్ ను ఆపేశామని ఆఫ్గాన్ అనౌన్స్ చేసింది. సౌదీ అరేబియా, ఖతార్‌ తదితర గల్ఫ్‌ దేశాల అభ్యర్థన మేరకు దాడుల్ని నిలిపివేశామని అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ చెప్పారు. సరిహద్దుల్లోని పాక్ ఆర్మీని అడ్డుకునేందుకే దాడులు నిర్వహించామని తెలిపారు. కానీ పాక్ మాత్రం ఇంకా ఆప్ఘాన్ ను కవ్విస్తూనే ఉంది. మళ్ళీ ఆ దేశంపై దండెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కనుక జరిగితే ఈసారి తాలిబన్లు మాత్రం ఊరుకోరు. పాకిస్తాన్ కు చాలా గట్టిగా బుద్ధి చెబుతారు. అప్పుడు అది మరో పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చును. 

ఆగని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..

ఇక మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..గత మూడేళ్ళుగా ఇది సాగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరెంత చెప్పినా వినడం లేదు. వేలు, లక్షల మంది ప్రాణాలు పోతున్నా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ ను రష్యాలో కలిపేంత వరకూ వార్ ను ఆపేది లేదని అంటున్నారు. అలాగే ఉక్రెయిన్ కూడా ఎంతకీ లొంగడం లేదు. రెందు దేశాల మధ్యా సయోధ్య కుదర్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇరు దేశాధ్యక్షులోనూ చర్చలు చేశారు. రష్యా మీద ఒత్తిడి తేవడానికి భారత్, చైనాలపై అదనపు సుంకాలతో దాడి చేశారు. కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది. రష్యా మాతరం తన దాడులను ఆపడం లేదు. చివరకు యుద్ధాలను ఆపుతాను, ప్రపంచ శాంతే తనకు ముఖ్యం అని చెబుతున్న ట్రంప్ విసిగి పోయి రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా యుద్ధం ఆపకపోతే అత్యంత విధ్వంసకరమైన..తోమహాక్ క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు ఇస్తానని అన్నారు. 

యూఎస్-ఇండియా మధ్య పెరుగుతున్న దూరం..

ఇవన్నీ ఇలా ఉంటే అమెరికాకు..ఇండియా నెమ్మదిగా దూరమౌతోంది. ఇరు దేశాధ్యాక్షులూ ఒకరిని ఒకరు పొగుడుకుంటున్నారు. మంచి మిత్రులమని చెప్పకుంటున్నారు. కానీ ఇంతకు ముందు ఉన్న దౌత్య సంబంధాలను కొనసాగించడం లేదు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని ట్రప్ చెబుతూనే...వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు. దేశానికి, భారతీయులకు నష్టం వచ్చే పనులన్నీ చేస్తున్నారు. మరవైప భారత ప్రధాని మోదీ కూడా ట్రప్ తో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తమ మధ్య అంతా బాగానే ఉందని చెబుతున్నారు కానీ ఇజ్రాయెల్ జరిగిన పీస్ మీట్ కు మాత్రం వెళ్ళలేదు. ట్రంప్ పిలిచినా మోదీ పట్టించుకోలేదు. 

ఇవన్నీ చూస్తుంటే...ప్రపంచ దేశాలన్నీ నెమ్మదిగా మూడో వరల్డ్ వార్ దిశగా కదులుతున్నాయా అనే అనుమానం రాకమానడం లేదు. పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ లు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే అన్ని దేశాలు కొట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ED Sheeran: దక్షిణాదిలోకి బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్..కోలీవుడ్ ఆల్బమ్ లో..

Advertisment
తాజా కథనాలు