/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
పాకిస్తాన్‌లోని లాహోర్‌తో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు, తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో అల్లర్లు చెలరేగి.. 12 మంది నిరసనకారులు మృతి చెందారు. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు భావించి, దానిని నిరసిస్తూ TLP మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఫ్లకార్టులతో నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీ చార్జితో ప్రజలను అదుపులోకి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఘర్షణలు చెలరేగాయి. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Massive protests by TLP going on in Lahore:
— War & Gore (@Goreunit) October 11, 2025
TLP protestors have reached Shadara, Lahore, 12+ protestors have been killed. pic.twitter.com/Rnna7xdm5L