Trump On India: ట్రంప్ ను నెత్తిమీద పెట్టుకున్న పాక్ ప్రధాని..మోదీ ఒక అద్భుతమన్న అమెరికా అధ్యక్షుడు

ఇజ్రాయెల్ పార్లమెంట్ లో నిన్న ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పాక్, బారత్ ల మధ్య యుద్ధాన్ని ఆపింది ట్రంపేనని ఆ దేశ ప్రధాని షెహబాజ్ మరో సారి పొగిడారు. అయితే ట్రంప్ మాత్రం భారత ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు.

New Update
trump, israel

గాజా శాంతి ప్రణాళిక ఒప్పందంలో మొదటి దశ నిన్న సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ఇరువైపులా బందీలు విడుదల అయ్యారు దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. అన్ని ముస్లిం దేశాధినేతల సమక్షంలో ట్రంప్ కు అరుదైన గౌరవం లభించింది. దీనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు.

మొదట పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ మాట్లాడుతూ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి మాట్లాడారు. ఆయన ఎనిమిది యుద్ధాలను ఆపారని చెప్పుకొచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా ట్రంపే ఆపారని షెహబాజ్ మరోసారి తెలిపారు. ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపి మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పారని పొగిడారు. అందుకే తాము ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేశామని చెప్పుకొచ్చారు. దక్షిణాసియాలోనే కాకుండా మధ్యప్రాచ్యంలో కూడా లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు" ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి మళ్ళీ నామినేట్ చేస్తానని షెహబాజ్ అన్నారు. 

మోదీ ఒక అద్భుతం..

దీని తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. గాజా శాంతి ప్రణాళిక, ఎనిమిది యుద్ధాలను ఆపడం లాంటి విషయాల గురించి మాట్లాడారు. దాంతో పాటూ భారత ప్రధాని మోదీని కూడా ట్రంప్ ప్రశంసించారు. ఆయనొక అద్భుతమని అన్నారు. భారత్...అమెరికాకు మిత్ర దేశమని, మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇండియా ఒక గొప్ప దేశమని కొనియాడారు. తన స్నేహితులలో మోదీ అగ్ర స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. దీని తరువాత బారత్, పాకిస్తాన్ మధ్య గొడవలు తగ్గుతాయని భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఆ రెండు దేశాలు కలిసి జీవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తాను నమ్ముతున్నానని..అమెరికా అధ్యక్షుడు..పాక్ ప్రధాని షెహబాజ్ ను చూసి నవ్వుతూ అన్నారు. 

దీనికి కొన్ని రోజుల ముందు భారత ప్రధాని మోదీ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. గాజా శాంతి ప్రణాళికతో అమెరికా అధ్యక్షుడు గొప్న శాంతిని సాధించారని అన్నారు. తాను ఫోన్ చేసి ట్రప్ తో మాట్లాడానని..అభినందించానని చెప్పారు. దాంతో పాటూ రెండు దేశాల మధ్యా జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి కూడా చర్చించానని తెలిపారు. త్వరలోనే అమెరికా, భారత్ మధ్య అన్ని సమస్యలూ తొలుగుతాయని మోదీ పోస్ట్ లో చెప్పారు. 

Also Read: Gaza Peace: గాజా శాంతి ఒప్పందంలో మొదటి దశ పూర్తి..దీని తరువాత ఏం జరగబోతోంది?

Advertisment
తాజా కథనాలు