NASA: ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న నాసా ఉద్యోగులు..ట్రంప్ వల్లే..
ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
ట్రంప్ దెబ్బకు నాసా షేక్ అయిపోయింది. దీంతో అక్కడి సీనియర్ ఉద్యోగులు షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు 2,145 మందికి పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
శాస్త్రవేత్తల ప్రకారం, సూర్యుడి వేడి పెరిగే కొద్దీ భూమి వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి, సుమారు 1 బిలియన్ సంవత్సరాల్లో భూమి పై జీవం అంతరించిపోతుంది. భవిష్యత్‌లో భూమిపై జీవం ఉండబోదు అని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నభారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడింది. మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా జూన్ 8కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.
చంద్రునిపై మానవ వ్యర్థాల కుప్ప పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నాసా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాటిని తొలగించేలా లేదా రీసైక్లింగ్ చేసేలా ఐడియా ఇచ్చిన వాళ్లకి 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) నజరానా అందిస్తామని చెప్పింది.
అంతరిక్ష అనుభవాలను మీడియాతో పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత దేశం గురించి కూడా స్పందించారు. ఇండియా మహా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. త్వరలోనే భారత్ కు వస్తానని తెలిపారు.
తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండి ఈ మధ్యనే భూమి మీదకు తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు మొట్టమొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు తనకు బాగానే ఉందని సునీతా చెప్పారు.
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు.
సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్‌కు ISRO చైర్మెన్ వీ నారాయణన్ వెల్కమ్ చెప్పారు. ISRO అధికారిక X అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు. పరిశోధనల్లో ఆమె అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు.
తాజాగా భూమిపై ల్యాండ్ అయిన సునీతా విలియమ్స్ త్వరలోనే భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. తన కుటుంబ సభ్యలతో సమయం గడిపి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆమె బంధువులు చెప్పారు.