Shut Down Effect: షట్ డౌన్ మరింత తీవ్రతరం.. డెమోక్రాట్ రాష్టాలకు నిధులు నిలిపేసిన ట్రంప్

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా ప్రభుత్వానికి నిధులు ఆగిపోయాయి. దీని కారణంగా అధ్యక్షుడు ట్రంప్ షికాగో కు 2.1 బిలియన్ల నిధులను ఆపేశారు.  దాంతో పాటూ 1.3 మిలియన్ల మంది ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయని తెలుస్తోంది.

New Update
Trump

Trump

అమెరికా సెనేట్ లో ప్రభుత్వం(Trump Government) రన్ చేయడానికి కావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీని కారణంగా అక్కడి ప్రభుత్వం మూతబడింది(USA Shut Down). చాలా ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. చాలా ప్రభుత్వ సేవలకు నిధులు ఆగిపోయాయి. సెనేట్ లో డొమోక్రాట్లకు, రిపబ్లికన్లు ఒక అంగీకారానికి రాకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. ముఖ్యంగా డెమోక్రాట్లు ఆరోగ్యానికి సంబంధించి బిల్లును పాస్ చేయాలని పట్టుబట్టారు. కానీ ఆ బిల్లు ఆమోదం పొందితే అక్రమ వలసదారులకు హెల్ప్ చేసినట్లు అవుతుందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. తాము ప్రతిపాదించిన బిల్లును రిపబ్లికన్లు ఒప్పుకోకపోవడంతో... వారు ప్రతిపాదించిన బిల్లులను కూడా డెమోక్రాట్లు అంగీకరించలేదు. దీని కారణంగానే అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయింది. 

Also Read :  గాజా పీస్ ప్లాన్ పై పాక్ తో పాటూ ముస్లిం దేశాల అసంతృప్తి.. వెనక్కు వెళ్ళే ఛాన్స్?

డెమోక్రాట్లపై ప్రతీకారం..

దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రంప్(Donald Trump) ఇప్పుడు డెమోక్రాట్ల మీద బదులు తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా షికాగో(chicago)కు దాదాపు 2.1 నిధుల బిల్లులను ఆపేశారు. తమ ప్రభుత్వం షట్ డౌన్ లో పడడానికి కారణం డెమోక్రాట్లేనని...అందుకే వారు పాలిస్తున్న ఇతర రాష్ట్రాల నిధులు కూడా ఆపేస్తామని ట్రంప్ అన్నారు. దీంతో పాటూ షట్ డౌన్ కారణంగా యూఎస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్, కోస్ట్ గార్డ్, స్పేస్ ఎయిర్ ఫోర్స్ లోని 1.3 మిలియన్ల మంది ఉద్యోగులకు జీతం అందడం లేదని వైట్ హౌస్ కార్యదర్శి కరోనా లీవిట్ చెప్పారు. ప్రస్తుతం ఈ షట్ డౌన్ మిలియన్ మంది అమెరికన్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చెప్పారు. డెమొక్రాట్ షట్‌డౌన్ వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి కారణంగా సైనిక కుటుంబాలు ఆహార సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని ఆమె కామెంట్ చేశారు.ఆహార ప్యాంట్రీల ద్వారా సహాయం కోరే కుటుంబాల సంఖ్య 34 శాతం పెరిగింది. టెక్సాస్‌లోని ఫోర్ట్ హుడ్ సమీపంలోని ఆర్మ్డ్ సర్వీసెస్ YMCA ఫుడ్ ప్యాంట్రీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఆహారం కోసం ఎదురు చూసే వారి సంఖ్య పెరిగిందని...అక్కడ పొడవైన వరుసలు కనిపించాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు జీతం లేకుండా పనిచేస్తున్నారని, జాతీయ వరద బీమా కార్యక్రమం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని లెవిట్ చెప్పారు.  

తాజాగా అమెరికా స్పేస్ ఏజెన్సీ(America Space Agency) అయిన నాసా(NASA) లో కూడా కార్యకలాపాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాని అధికారిక వెబ్‌సైట్‌లో ''ఫెడరల్‌ ప్రభుత్వం నిధుల కొరత కారణంగా నాసా వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేయడం లేదంటూ'' చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వ నిధుల బిల్లులకు కాంగ్రెస్‌(అక్కడి పార్లమెంట్‌)లో ఆమోదం లభించకపోవడంతో ఇటీవల షట్‌డౌన్‌ మొదలైన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లలో తొలిసారిగా షట్‌డౌన్‌ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. షట్‌డౌన్ ప్రభావం వల్ల అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు నాసా కూడా ఈ జాబితాలో చేరింది. నాసాలో చూసుకుంటే కూడా పలు కీలక అంతరిక్ష ప్రాజెక్టులు నిధులు లేని కారణంగా ఆగిపోయినట్లు ప్రచారం నడుస్తోంది. కేవలం అతి ముఖ్యమైన సేవలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Indian Students: అమెరికాకు నో చెబుతున్న భారత విద్యార్థులు..జూలై-ఆగస్టులో 50శాతం తగ్గుదల

Advertisment
తాజా కథనాలు