/rtv/media/media_files/2026/01/21/sunita-2026-01-21-10-52-11.jpg)
Sunita Williams
Sunita Williams: 27 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్..అంతరిక్షంలో 608 రోజులు..తొమ్మిది స్పె్ వాక్ లు...రెండు దేశాల కీర్తి పతాక..ఏ మహిళా అందుకోలేని ఎతైన శిఖరాలు..నా జీవితానికి ఇది చాలంటున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. 60 ఏళ్ళ వయసులో తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.గతేడాది డిసెంబరు 27 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని NASA నిర్వాహకురాలు జారెడ్ ఐజాక్‌మన్ విలియమ్స్ చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాలుగా, విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో మూడు మిషన్లను పూర్తి చేశారు. నాసా చరిత్రలో అత్యంత విజయవంతమైన వ్యోమగాములలో ఒకరిగా నిలిచి రికార్డులు సృష్టించారు. ఎంతో మంది వ్యోమగాములకు మార్గదర్శకురాలిగా నిలిచారు సునీతా విలియమ్స్.
భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. 1958లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు.
Also Read: క్రేజీ బజ్.. 'ధురంధర్ 2'కు ఆ హిట్ సినిమాతో లింక్..?
రిక్డార్డులన్నీ ఆమెవే..
1998లో సునీతా విలియమ్స్ నాసాకు ఎంపిక అయ్యారు. అక్కడి నుంచి 27 ఏళ్ళ పాటూ పని చేశారు. తన కెరీర్‌లో మొత్తం మూడు అంతరిక్ష యాత్రల్లో ఆమె పాల్గొన్నారు. భూమికి దూరంగా నింగిలో సునీతా గడిపిన మొత్తం సమయం 608 రోజులు. నాసా చరిత్రలో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల్లో ఆమె రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా మహిళా వ్యోమగామిగా అత్యధికంగా 9 సార్లు స్పేస్ వాక్ (62 గంటల 6 నిమిషాలు) చేసిన రికార్డు కూడా ఈమె పేరిటే ఉంది. అంతరిక్షంలో మారథాన్ రన్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు. 2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించి.. అత్యధిక స్పేస్ వాక్‌లు చేసిన మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు నెలకొల్పారు.
Also Read: ఏం గుండెరా వాడిది..! ఏనుగును దత్తత తీసుకున్న సూపర్‌స్టార్ శివకార్తికేయన్.
పట్టుదలకు చిరునామా
2024లో కేవలం వారం రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్ళిన సునీతా సాంకేతిక సమస్యల కారణంగా మొత్తం 286 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బోయింగ్ స్టార్ లైనర్ లో వీరు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఎనిమిది రోజులుకు వెళ్ళిన వాళ్ళు తొమ్మిది నెలలు ఉండిపోయారు. అది కూడా భూమి మీద అన్నీ అనుకూలంగా ఉండే ప్రదేశంలో కాదు. అంతరిక్షంలో భార రహిత స్థితిలో. అక్కడ ఆక్సిజన్ తో పాటూ అన్నీ కష్టమే. తినాలన్నా, తాగాలన్నా, పడుకోవాలన్నా కూడా కూడా ప్రత్యేకంగా చేయాలి. గాల్లో తేలియాడుతూ బతకాలి. అలాంటి స్థితిలో పదిరోజులు ఉండడమే కష్టం అంటే అస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్ మోర్ లు తొమ్మిది నెలలు గడిపారు. చేయడానికి పని ఉండదు, మాట్లాడ్డానికి ఎవరూ ఉండరు. చుట్టూ శూన్యం. ఎలాగో ఒకలా తిరిగి వచ్చేస్తాము అనుకోవడానికి అస్సలే లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంతకు ముందు ఏ వ్యోమగామి ఎదుర్కోని కష్టాలను సునీతా విలియమ్స్ ఎదుర్కోవలసి వచ్చింది. అది కూడా 59 ఏళ్ళ వయసులో. కానీ అనుభవం నేర్పిన సంయమనంతో, ఒపికగా భూమి మీదకు తిరిగి రావడానికి ఎదురు చూశారు సునీతా విలియమ్స్. సమస్యలకు వెన్నుచూపని దృఢచిత్తం, భవిత పట్ల సానుకూల దృక్పథంతో ఆ పరీక్షలో నెగ్గుకొచ్చారు. తనలోని ధైర్యాన్ని పోనివ్వకుండా చూసుకున్నారు. మన మనసే మన నేస్తం... అదే మన శత్రువు కూడా అన్న శ్రీకృష్ణుని మాటలను తలుచుకుంటూ మనసునూ , బుద్ధినీ రెండింటినీ అదుపులో పెట్టుకుని భూమి మీదకు తిరిగి వస్తామని ధృడ సంకల్పంతో వెయిట్ చేశారు.
Also Read: T20 Series: వరల్డ్ కప్ ముందు ఆఖరి సీరీస్.. ఇదైనా సరిగ్గా ఆడతారా?
Follow Us