/rtv/media/media_files/2025/05/19/gqpJCf63MWg9iAUfwlsL.jpg)
End of the World
End of the World: భవిష్యత్‌లో భూమిపై జీవం ఉండబోదు అని శాస్త్రవేత్తలు(Scientists) హెచ్చరిస్తున్నారు. టోహో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు NASA ప్లానెటరీ మోడలింగ్ సహాయంతో రూపొందించిన సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రకారం, పెరుగుతున్న సూర్యుడి వేడి(Sun Heat) వల్ల భూమి వాతావరణంలోని ఆక్సిజన్(Oxygen) మరికొద్ది కోట్ల ఏళ్లలో పూర్తిగా తగ్గిపోతుందని తెలుస్తోంది.
Also Read: ఇస్రో PSLV-C61 ప్రయోగం ఎందుకు ఫెయిలైందంటే?
ఈ అధ్యయనం ప్రకారం, సుమారు మరో 1 బిలియన్ సంవత్సరాల్లో భూమి వాతావరణం నుండి ఆక్సిజన్ పూర్తిగా మాయమవుతుంది. దీంతో, ప్రస్తుత జీవరాశికి జీవించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఇక ఉండవు. ఈ పరిశోధన Nature Geoscience అనే జర్నల్‌లో "The future lifespan of Earth’s oxygenated atmosphere" అనే శీర్షికతో ప్రచురితమైంది.
Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!
సూర్యుని వేడి భూమిని ఎలా ప్రభావితం చేస్తుంది?
శాస్త్రవేత్తలు 400,000 వాతావరణ నమూనాలను విశ్లేషించగా, భవిష్యత్తులో సూర్యుడు మరింత వేడి, ప్రకాశవంతంగా మారుతాడు. ఈ కారణంగా:
- భూమిపై నీరు ఆవిరైపోతుంది
- ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి
- కార్బన్ చక్రం స్తబ్దతకు గురవుతుంది
- మొక్కలు నశించి ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది
దీంతో భూమి వాతావరణం మళ్ళీ మొదటికి వెళ్తుంది, అంటే మెథేన్ ప్రధానమైన వాతావరణానికి మారుతుంది. ఇది "గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్"కి ముందు ఉన్న భూమి వాతావరణాన్ని పోలి ఉంటుంది.
Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..
భవిష్యత్ జీవరాశి ఎలా ఉండవచ్చు?
టోక్యోలోని టోహో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కజుమీ ఒజాకి ప్రకారం, భూమి జీవవైవిధ్యం మసలుకోలేనంతగా మారిపోతుంది. ప్రస్తుతం మనం ఊహించగలిగిన జీవరాశి కాకుండా, భవిష్యత్తులో తక్కువ ఆక్సిజన్‌తో ఉండగలిగే సూక్ష్మ జీవులే ఉండే అవకాశముంది.
గతంలో శాస్త్రీయ అంచనాల ప్రకారం భూమి జీవవంతంగా ఉండగలిగే కాలం 2 బిలియన్ సంవత్సరాలుగా భావించేవారు. అయితే తాజా పరిశోధన ఆ అంచనాలను తగ్గించి, వేగంగా ఆక్సిజన్ భూమి పై నుండి మాయం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్ అదిరింది! (ఫోటోలు)
శాస్త్రవేత్తల హెచ్చరిక
"సూర్యుని వేడి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, భూమి వాతావరణంలో CO2 స్థాయిలు తగ్గడం సహజం. దీని వల్ల ఫోటోసింతసిస్ క్షీణించి జీవరాశి కనుమరుగవుతుంది" అని కజుమీ ఒజాకి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, భూమి పునర్వాసం గురించి పరిశోధనలు, ఇతర గ్రహాలపై జీవనం వంటి అంశాలపై శోధనలకు ప్రాధాన్యం సంతరించుకుంది. భూమిపై జీవితం శాశ్వతం కాదని, భవిష్యత్తులో అసాధారణ వాతావరణ పరిస్థితులకు మనము సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం స్పష్టంగా తెలుపుతుంది.