Shubhanshu Shukla ISS Mission Postponed: కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసియాత్ర వాయిదా ?

భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నభారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడింది. మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా జూన్ 8కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.

New Update
Captain Subhanshu Shukla's space mission

Captain Subhanshu Shukla's space mission

Shubhanshu Shukla ISS Mission Postponed: భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వైమానిక దళం(Indian Air Force) గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడిందని(Space Travel Postponed) ఆక్సియం స్పేస్(Axiom Space) ధృవీకరించింది. అయితే మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల దాన్ని జూన్ 8కి మార్చినట్లు అమెరికాకు(America) చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్, నాసా(NASA) సంయుక్తంగా ప్రకటించాయి.

ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

జూన్ 8న 6:41 గంటలకు

భారత కాలమానం ప్రకారం జూన్ 8న సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్‌కు(SpaceX) చెందిన డ్రాగన్ అంతరిక్ష నౌకలో(Dragon Spacecraft) శుభాన్షు శుక్లా రోదసిలోకి పయనించనున్నారు. ఇందులో ఆయనతో పాటు అమెరికాకు చెందిన పెగీ విట్సన్(Peggy Whitson), పోలండ్‌కు(Poland) చెందిన స్లావోస్జ్ ఉజ్ఞాన్స్కీ(Slavosz Ugnanski), హంగేరీకి చెందిన కపు టిబోర్(Cup Tibor) ఉంటారు. వీరు 14 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో పరిశోధనలు చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఫ్లైట్ షెడ్యూల్‌ను సమీక్షించిన అనంతరం నాసా, దాని భాగస్వామ్య సంస్థలు రాబోయే కొన్ని మిషన్ల ప్రయోగ తేదీలలో మార్పులు చేసినట్లు వెల్లడించాయి. "కార్యకలాపాల సంసిద్ధతను బట్టి, యాక్సియమ్ మిషన్ 4 ప్రయోగానికి కొత్త తేదీ జూన్ 8, ఉదయం 9:11 (తూర్పు అమెరికా కాలమానం)" అని నాసా తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. 2,000 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న పైలట్ శుక్లా 2019 లో భారతదేశ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. రష్యా, భారతదేశం, యూఎస్‌లలో విస్తృతమైన శిక్షణ పొందారు.

ఇది కూడా చూడండి: RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)

 ప్రపంచ మానవ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతోనూ, 2027లో జరగనున్న దేశంలోని మొట్టమొదటి స్వదేశీ సిబ్బందితో కూడిన మిషన్ గగన్‌యాన్‌కు సిద్ధం కావాలనే భారతదేశ ఆశయాలలో Ax-4 మిషన్‌లో ఆయన పాల్గొనడం ఒక కీలకమైన అడుగుగా పరిగణించబడుతుంది. 1984లో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ తర్వాత భారత్‌కు చెందిన శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లనుండటం విశేషం. అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా), భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) సంయుక్తంగా నిర్వహితున్న ఈ యాత్రలో శుభాన్షు శుక్లా ఏడు ప్రయోగాలను అధ్యయనం చేస్తారు.

Also Read :  హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు